శనివారం మంగళగిరి రత్నాల చెరువులో మాట్లాడుతున్న లోకేష్
తాడేపల్లి రూరల్ (మంగళగిరి)/అమరావతి బ్యూరో: ‘ఇక నుంచి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మా ఇంట్లో ‘ఫ్యాన్’ కింద కూర్చుని చల్లగా కబుర్లు చెప్పుకుందాం. మీరెవరూ అధైర్యపడొద్దు’.. అంటూ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. మంగళగిరి రత్నాలచెరువులో శనివారం నిర్వహించిన సభలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల కూడా ఏప్రిల్ 11కు బదులు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ లోకేశ్ ప్రచారం చేశారు.
నూతక్కిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మార్చి 23న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామడంతో అంతా విస్తుపోయారు. అలాగే దేశంలో 29 రాష్ట్రాలకు బదులు 28 రాష్ట్రాలని అనడంతో ఆయన వెంట ఉన్నవారు కంగుతిన్నారు. మరోవైపు లోకేశ్ తరపున సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నా తప్పుల తడకగా మాట్లాడుతుండటంతో వెనక్కి తగ్గినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment