ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(పాత చిత్రం)
ప్రకాశం జిల్లా : ప్రత్యేక హోదా కోసం తొమ్మిదోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానం సంబంధించి చర్చకు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు సమావేశాల చివరి వరకు వేచి చూస్తామని తెలిపారు.హోదా ఇవ్వకపోతే రాజీనామాలు చేసి ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగుతామని వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పాలనంతా అవినీతిమయం విమర్శలు సంధించారు. నాలుగేళ్లలో వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు నాలుగు కి.మీలు కూడా పూర్తి చేయలేదని తూర్పారబట్టారు. కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment