మీడియాతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ గట్టిగా పట్టుబడుతోంది. సభలో ఆర్డర్‌లో లేదన్న కారణంతో వరుసగా నాలుగోసారి లోక్‌సభను వాయిదా వేయడంతో అవిశ్వాసంపై చర్చ జరగలేదు. ఈ నేపథ్యంలో ఈరోజైనా చర్చ జరుగుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
చర్చే జరిగే వరకు పట్టుబడతాం: వైవీ సుబ్బారెడ్డి
నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ చిత్తశుద్ధితో పోరాడుతోందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హోదాపై ఎవరు డ్రామాలాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని, అవిశ్వాసంపై పార్లమెంట్‌లో చర్చ జరిగే వరకు పట్టుబడతామని స్పష్టం చేశారు. మరోసారి స్పీకర్‌ను కలుస్తామన్నారు. ఎన్డీఏ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పార్లమెంట్ లోపల, వెలుపలా పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment