
సాక్షి, అమరావతి: ఇది టీడీపీకి అత్యంత కీలకమైన సమయమని, పార్టీ ఎంపీలంతా మరింత చురుకుగా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అవిశ్వాసంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామన్నారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అవిశ్వాసంపై లోక్‌సభలో సోమవారం ఓటింగ్‌కు పట్టుబట్టాలని, డివిజన్ కోరాలని సూచించారు.
ఆరుగురు సభ్యుల ఎంపీల బృందం ఢిల్లీలోనే ఉండి అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలసి టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలని ఆదేశించారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తోందని, జాతీయ స్థాయిలో ఏపీ ప్రజల గొంతు వినిపించామన్నారు.రాజ్యసభలో తాను మాట్లాడుతుండగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడ్డుకోవాలని చూసినా రాష్ట్ర ప్రజల మనోభావాలను సభ దృష్టికి తెచ్చానని ఎంపీ సుజనా చౌదరి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment