![Parchur TDP Leader Ramanatham Babu Joins YSRCP - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/26/YS-JAGAN-CM.jpg.webp?itok=Hnxi9EqJ)
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు పర్చూరు టీడీపీ నేత రామనాథం బాబు తెలిపారు. గురువారం తన మద్దతుదారులతో కలిసి ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువాలతో వీరందరినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామనాథం బాబు మాట్లాడుతూ... విశాల హృదయంతో తమను సీఎం జగన్ పార్టీలో చేర్చుకున్నారని, వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు.
రామనాథం బాబు తన అనుచరులతో పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నానని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. రామనాథం బాబు మంచి నిర్ణయం తీసుకున్నారని, అందరం కలిసి జగనన్న ప్రభుత్వానికి వెన్ను దన్నుగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: టీడీపీకి మరో ఎదురుదెబ్బ)
Comments
Please login to add a commentAdd a comment