అనివార్య ఘటనలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత | Pawan Kalyan letter to DGP to provide security | Sakshi
Sakshi News home page

అనివార్య ఘటనలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత

Published Wed, Mar 14 2018 1:09 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan letter to DGP to provide security - Sakshi

సాక్షి, అమరావతి: తనకు వ్యక్తిగత భద్రత కల్పించాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర డీజీపీకి మంగళవారం లేఖ రాశారు. ‘‘14న జరిగే జనసేన సభ భద్రతకు పోలీసు శాఖ తీసుకుంటున్న జాగ్రత్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో నాకు కల్పిస్తున్న వ్యక్తిగత భద్రతను 14వ తేదీ తర్వాత కూడా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను’’ అని పవన్‌ కోరారు. గతంలో పలు సందర్భాల్లో రాష్ట్రంలో పర్యటించినప్పుడు ట్రాఫిక్‌ జామ్, తొక్కిసలాట జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని తనకు భద్రతను కోరుతున్నట్టు తెలిపారు. పోలీసులు భద్రతను అందించడంలో నిస్సహాయతను ప్రకటిస్తే.. తాను రాష్ట్రంలో పర్యటిస్తుండగా ఏవైనా అనివార్య సంఘటనలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement