ఎన్నికల వరకే రాజకీయాలు | Politics Only In Elections Says By Puvvada Ajay Kumar In Khammam | Sakshi
Sakshi News home page

ఎన్నికల వరకే రాజకీయాలు

Published Mon, Jul 15 2019 12:08 PM | Last Updated on Mon, Jul 15 2019 12:09 PM

Politics Only In Elections Says By Puvvada Ajay Kumar In Khammam - Sakshi

పార్టీ సభ్యత్వాలను అందిస్తున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి, రఘునాథపాలెం:  ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటే అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని చింతగుర్తిలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోనే ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 50 వేలపైగా నమోదు కాగా అదనంగా మరో 10 వేల పుస్తకాలను తీసుకోవడం జరిగిందన్నారు. అభివృ ద్ధి, సంక్షేమం పాలనతో ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందని అందుకే సభ్యత్వాలు పెద్ద ఎత్తున చేరుతున్నారని పేర్కొన్నారు. తన గెలుపు కోసం పని చేసిన వారితోపాటు, కొత్తగా పార్టీపై నమ్మకంతో చేరుతున్న వారికి సైతం సముచిత స్థానం ఉంటుందన్నారు.

పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలను భట్టి పదవులు దక్కుతాయన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలుపు ఓటమిలు నిర్ణయిస్తారని  పార్టీలు మాత్రం వారి మనుషులు గెలుచుకునే విధంగా వారి సమస్యల పరిష్కారం కోసం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.  గత ఎన్నికలకు ముందు ఖమ్మం– ఇల్లెందు రోడ్డులో మండలంలో ఇరుకు రోడ్డుగా ఉండేదని,  గడిచిన నెల ల్లో  నాలుగు లైన్లు రోడ్లుగా విస్తరించి ఘననీయమైన అభివృద్ధి సాధించడంతోపాటు, మీ భూము లకు విలువైన ధరలు  వచ్చాయన్నారు. అందరూ ఒకే వైపే ఉంటే అభివృద్ధి  మరింత ముందుకు తీసుకు పోయేందుకు అవకాశం ఉంటుందన్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి, వారి సంక్షే మం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతున్నారని  అలాంటి దారిలో  రఘునాథపాలెం మం డలంలో కూడా ఎంపీటీసీలు, సర్పంచులు చేర డం తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఓట్లు లేవు, సీట్లు లేవు అయినా పార్టీలో చేర్చుకోవడం అంటే టీఆర్‌ఎస్‌ అభివృద్ధిని కోరుకుంటుందన్నా రు. ఇంకా సభలోజెడ్పీటీసీ సభ్యులుఆజ్మీరా  వీరు నాయక్,  ప్రియాంక, సర్పంచ్‌ మెంటం రామారా వు, ఎంపీటీసీ సభ్యుడు మాలోత్‌ రాంబాబు, కుర్రా భాస్కరరావు, ఉప సర్పంచ్‌ కేవీ, కొమర య్య, తాత వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. 

కాంగ్రెస్‌ను వీడిన ఎంపీటీసీ  
చింతగుర్తి  ఎంపీటీసీ సభ్యురాలు మాలోత్‌ లక్ష్మి, మాజీ సర్పంచ్‌ తమ్మిన్ని నాగేశ్వరరావు, వార్డు సభ్యులు గునగంటి లక్ష్మి, భాగం లక్ష్మీనారాయణ, బుజ్జి, సీతారాములు, గోపయ్య కాంగ్రెస్‌ను వీడి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారకి పార్టీ కండవాలు కప్పి ఎమ్మెల్యే స్వాగతించి పార్టీ సభ్యత్వాలు అందించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరినట్లు వారు ఈ సందర్భం గా ప్రకటించారు. కార్యక్రమంలో  సర్పంచ్‌ మెం టం రామారావు, ఎంపీటీసీ సభ్యుడు మాలోత్‌ రాంబాబు, కొత్తా కొమరయ్య, జంగాల శ్రీను. కాపా భూచక్రం, దానయ్య, గుడిపుడి రామా రావు, యాసా రామారావు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement