కేసీఆర్‌ నిజ స్వరూపం బయటపడింది.. | Ponnala Lakshmaiah Revealed KCR Secret | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ నిజ స్వరూపం బయటపడింది: పొన్నాల

Published Fri, Oct 18 2019 6:08 PM | Last Updated on Fri, Oct 18 2019 7:03 PM

Ponnala Lakshmaiah  Revealed KCR Secret - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చేసిన దొంగ దీక్ష గురించి తనకు ఆరోజే తెలిసినా తెలంగాణ కోసం మాట్లాడలేదని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల.. దీక్ష చేస్తూ 700 కిలో క్యాలరీల ద్రవాహారాన్ని కేసీఆర్‌ తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఇప్పుడు ఫామ్‌ హౌస్‌, ప్రగతి భవన్‌, పబ్లిక్‌ మీటి​oగ్‌లకే పరిమితమై, ప్రపంచ నియంతలలో మొదటి స్థానాన్ని సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌ ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. ఆర్టీసీ నుంచి ప్రభుత్వం తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేసీఆర్‌ నిజ స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మంచి సలహాలు కూడా స్వీకరించని కేసీఆర్‌ రాక్షస, దోపిడీ పాలనకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement