ప్రయాగ్‌రాజ్: తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్న ప్రియాంకగాంధీ వాద్రా సోమవారం ప్రయాగరాజ్ వద్ద గంగానదిలో మూడురోజుల బోటుయాత్రను ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగానదిలో 140 కిలోమీటర్లు బోటులో ప్రయాణించనున్న ఆమె.. ప్రధాని మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో యాత్రను ముగించనున్నారు. పవిత్ర గంగానదిలో సాగుతున్న బోటుయాత్రలో భాగంగా ఆమె నదీపరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల వద్ద ఆగి.. వారిని పలకరిస్తూ.. వారితో ‘బోటుపే చర్చ’ కార్యక్రమం నిర్వహిస్తూ.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా వెనకబడిన తరగతులు, షెడూల్డ్ కులాల ప్రజలతో మమేకమవుతూ.. వారిని కలుస్తూ ప్రియాంక ఈయాత్రలో ముందుకుసాగనున్నారు. తూర్పు యూపీలో ఈ రెండు సామాజికవర్గాలు ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వారిని ఆకట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్‌లో పూర్వవైభవాన్ని తీసుకురావాలని ప్రియాంక భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment