![Rahul Gandhi Fires On Central Government Over Galvan - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/8/Rahul.jpg.webp?itok=LBlwwqt1)
న్యూఢిల్లీ: చైనాతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. గల్వాన్ లోయ ప్రాంతంలో గతంలో ఉన్న యథాతథ స్థితి నెలకొనేలా చైనాపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని, గల్వాల్ లోయ ప్రాంతం భారత్‌దేనని ఎందుకు స్పష్టం చేయడం లేదని మంగళవారం ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు. భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య చర్చల అనంతరం రెండు దేశాల ప్రకటనలను రాహుల్ తన పోస్ట్‌కు జతపరిచారు. గల్వాన్ లోయను చైనా ప్రకటనలో ప్రస్తావించారు కానీ, భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తావించలేదని రాహుల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment