ఒకరిపై మరొకరు చేయి వేసి మాట్లాడుతున్న రాహుల్, ప్రియాంక
రాయ్‌బరేలీ: మంచి సోదరుడు ఎలా ఉండాలనే దానికి రాహుల్ కొత్త అర్థం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్, ఆయన సోదరి ప్రియాంక యూపీలోని కాన్పూర్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. అప్పుడు వీరిద్దరూ సరదాగా మాట్లాడారు. ‘మంచి సోదరుడంటే అర్థం ఏంటో చెప్తాను. ఎన్నికల ప్రచారంలో సుదూర ప్రయాణాలు చేసే నాకేమో చిన్న హెలికాప్టర్. చాలా తక్కువ దూరాలకు ప్రయాణించే ప్రియాంకకు మాత్రం సువిశాలమైన హెలికాప్టర్’ అంటూ సరదాగా అన్నారు. దీంతో ప్రియాంక ‘అంతా అబద్ధం’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘ఏదేమైనా నేను నా చెల్లిని ప్రేమిస్తున్నాను’ అని రాహుల్ మాట్లాడారు. వీరిద్దరి సరదా సంభాషణ వీడియో రాహుల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
70 ఏళ్లలో ఏ పార్టీ గబ్బర్‌సింగ్ ట్యాక్స్ తేలేదు
గత 70 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) వంటివి విధించలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు పేరుతో ప్రజలను మోసం చేశారని, ఇది ఓ అవివేకమైన చర్య అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని ఉంచాహార్‌లో ర్యాలీలో మాట్లాడారు. దేశంలో ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేయకుండా మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. మోదీకి ఈ ఖాళీలను భర్తీ చేయడం ఇష్టం లేదని, కేవలం ఆయన తన మిత్రులకే సాయం చేస్తారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 22 లక్షల జాబ్‌లను భర్తీ చేస్తామని.. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించారు. దీనిలో కనీస మద్దతు ధర, తుపాను వంటి విపత్తులు సంభవించినప్పుడు అందించే పరిహారం, బీమా సమాచారం సహా పలు వివరాలు ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment