good relations
-
సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సత్సంబంధాలు
న్యూఢిల్లీ: చైనాతో సత్సంబంధాలపై భారత్ మరోసారి స్పష్టతనిచ్చింది. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా ఆ దేశంతో సాధారణ సంబంధాలను సాగించడం వీలుకాదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా తన బలగాలను మోహరించడమే ప్రధాన సమస్య అని ఆయన గురువారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారత్ కూడా కోరుకుంటోందన్న ఆయన.. రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొన్నప్పుడు మాత్రమే అలాంటిది సాధ్యమని పేర్కొన్నారు. చైనా ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని ఆ దేశానికి తెలియజేశామన్నారు. ఘర్షణలు, రెచ్చగొట్టే చర్యలు, తప్పుడు కథనాలు వంటి వాటికి భారత్ భయపడబోదన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ల పట్ల చైనాకు తన నిరసనను భారత్ పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉందన్నారు. ‘ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న పరిస్థితులు చైనాకు కూడా ఏమంత మంచివికావు. సరిహద్దుల్లో పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపింది..ఇంకా చూపుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతత లేనప్పుడు సాధారణ సంబంధాలను ఆశించడం సరికాదు’అని జై శంకర్ అన్నారు. 2020 మేలో సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తినప్పుడు చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మీడియా ప్రస్తావించగా.. సరిహద్దులకు అత్యంత సమీపంలో రెండు దేశాల బలగాల మోహరింపే అసలైన సమస్య అని మంత్రి బదులిచ్చారు. సమస్య పరిష్కారానికి రెండు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ‘సంబంధాలు మాత్రం తెగిపోలేదు. విషయం ఏమిటంటే..రెండు దశాబ్దాల్లోనే అత్యంత భీకరంగా 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. గల్వాన్ ఘర్షణల తర్వాత రోజు ఉదయం చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడాను కూడా. ఆ తర్వాత కూడా దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగిస్తున్నాం. అయితే, చైనా మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలకు దిగుతోంది. అందుకే ఆ దేశంతో సంబంధాలు గాడినపడటం లేదు’అని వివరించారు. ఒక్క చైనాతో తప్ప అన్ని ముఖ్యమైన అన్ని దేశాలు, సమూహాలతో భారత్ సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. -
అవాంఛిత సంబంధాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు.. కుటుంబాన్ని కాపాడుకోలేమా?
అపనమ్మకం, ఆర్థిక కష్టాలు.. వ్యసనాలు, పొసగని అంచనాలు కమ్యూనికేషన్ గ్యాప్, అవాంఛిత సంబంధాలు.. భార్యాభర్తల మధ్య తగాదాలకు కారణాలై పెను పరిణామాలకు దారి తీస్తున్నాయి. భార్య మీద కోపం, భర్త మీద అసహనం పిల్లల మీద, పరస్పరం పగ తీర్చుకునేలా చేస్తున్నాయి. క్షణికోద్రేకం జీవితాలను నాశనం చేస్తున్నది. కుటుంబాన్ని కాపాడుకోలేమా? కనీసం తక్కువ నష్టంతో సమస్యలను సరిచేసుకోలేమా? ఇవాళ నివురుగప్పిన నిప్పులా ఉన్న అన్ని కుటుంబాలు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. సులభంగా బతకడం అత్యంత జటిలం అవుతున్న కాలం ఇది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు కలిసి బతకడం ఎందుకు జటిలం అవుతుంది? భార్య గృహిణిగా లేదా ఉద్యోగిగా ఉండొచ్చు. భర్త ఏదో ఒక సంపాదనపరుడై ఉండొచ్చు. పిల్లలు చదువుకుంటూ ఉండొచ్చు. ఇల్లు గడవడానికి, పిల్లల్ని చదివించడానికి, అవసరాలకు తగిన సంపాదన ఉంటే సులభంగా, సంతోషంగా జీవించడం సాధ్యం అవుతుందా? ఎందుకు అశాంతి వస్తున్నది. భార్య లేదా భర్త ఎందుకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు? ఎందుకు క్షణికోద్రేకంలో పిచ్చి పనులు చేస్తున్నారు. ఎందుకు ఏదైనా తీవ్ర చర్య చూపితే తప్ప భార్యకో, భర్తకో బుద్ధిరాదని అనుకుంటున్నారు. వారి మనసుల్లో ఇంత కల్లోలం రేగుతుంటే రక్త సంబంధీకులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అను సమాజం ఏం చేస్తోంది? ఇదంతా ఏమిటి? ఇంత రుగ్మతలోకి కుటుంబాలు వెళుతుంటే సమాజం కూడా రుగ్మతలోకి వెళుతున్నట్టేనని ఎందుకు అందరం జాగృతం కావడం లేదు. ఇవి ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న. చదవండి: ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయా?! ఒక్క క్లిక్‌తో అంతా ఉల్టా పల్టా! సహనా వవతు మన సంస్కృతిలో ‘సహనా వవతు’ అనే భావన అవసరం పెద్దలు ఎప్పుడో చెప్పారు. ‘కలిసి ముందుకు సాగడం’ దీని అర్థం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వధువు లేదా వరుడు రేపు ఏర్పరచుకోబోయే కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా వంటబట్టించుకోవాల్సిన సూత్రం ఈ సహనా వవతు. ఇంతవరకూ నేను ఒక్కడిని ఇకపై కలిసి జీవించాలి అని అర్థం చేసుకుంటే, కలిసి జీవించడం అంటేనే సర్దుబాటు అనుకుంటే చాలా సమస్యలు రావు. భార్య/భర్త పూర్తిగా నచ్చేలా లేకపోయినా, పిల్లల ప్రవర్తన పూర్తిగా లోబడి ఉండకపోయినా, ఇంట్లో రకరకాల అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నా అవన్నీ సర్దుబాటు చేసుకునేలా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండాలి. తెగేదాకా లాగని మనస్తత్వం పొదు చేసుకోవాలి. లేకపోతే అశాంతి... ఆందోళన. ఏడు కారణాలు భార్యాభర్తల మధ్య గొడవలకు, ఘర్షణకు, వాగ్వివాదాలకు ప్రధానంగా 7 కారణాలు కనిపిస్తాయి. మానసిక దూరం: భార్యాభర్తల మధ్య మానసిక దూరం పెరిగి΄ోతే ఒక చూరు కింద వారు ఎన్నేళ్లు జీవించినా వారు సన్నిహితులు కారు. నిజమైన సంతోషం పొందలేరు. తమ మధ్య మానసిక దూరం పెరిగిందని భార్యాభర్తలకు తెలిసినా దానిని నివారించడానికి ప్రయత్నించరు. ఫలితం.. ఏదో ఒక పెను ఘటన. చదవండి: మా పాట అడవి దాటింది.. ఆదివాసీ గాయని లక్ష్మీబాయ్ పెంపకం కొట్లాట: పిల్లల విషయంలో నిరంతర తగువు. ఒకరు వెనకేసుకు రావడం ఒకరు కఠినంగా ఉండటం... చదువు, స్కూళ్ల విషయంలో రభస... తిండి గురించి మరో తగవు... మార్కులు, హోమ్ వర్క్‌లు... కొద్దిసేపు కూచుని ఓర్పుగా మాట్లాడుకుంటే ఎవరైనా ఎక్స్పర్ట్ సలహాకు తల వొగ్గితే ఈ సమస్య ఉండదు. కాని వినరు. కమ్యూనికేషన్ లోపం: ఏదీ చెప్పరు. చెప్పుకోరు. చెప్పాలని గుర్తించరు. అతని ఖర్చు ఆమెకు తెలియదు. ఆమె కొనుక్కోవాలనుకుంటున్న వస్తువు ను అతను కొనివ్వడు. బంధువులు, స్నేహితులు వారి రాకపోకల గురించి, వాళ్ల ఇళ్లకు వెళ్లడం గురించి మాట్లాడుకోరు. వీలు కాదు, వీలవుతుంది, వెళ్లాలి, వెళ్లక్కర్లేదు.. ఇవి ఉమ్మడి అంగీకారంతో జరగాల్సిన నిర్ణయాలు. అలా లేనప్పుడే ఆగ్రహం, పంతం. ఫుల్స్టాప్ లేని వాదనలు: ఒకరు వాదిస్తుంటే మరొకరు తగ్గడం జరిగితే ప్రమాదం ఉండదని ఇరువురికీ తెలుసు. కాని వాదనలు పెంచుకుంటూ పోతారు. పాత గొడవలు తవ్వుతారు. పై చేయి సాధించడానికి చెత్త మాటలు, అబద్ధాలు, అభాండాలు వేసి గాయపరుస్తారు. ఒకరినొకరు అవమానించుకుంటారు. చదవండి: భయం లేకుండా స్త్రీలు పార్కులకు వెళ్లొచ్చు.. ఇవి వారికి మాత్రమే! ఆర్థిక సమస్యలు: పెళ్లి సమయంలోనే ఇరువురి ఆర్థిక స్థితి తెలుసుకాబట్టి ఆ గ్రాఫ్ చేరుకునే బిందువును అంచనా కట్టుకుని జీవితాన్ని మొదలెట్టాలి. మనం సామాన్య ఉద్యోగులం అయినా పెద్ద ఉద్యోగాలు చేసే జంటతో పోల్చుకుంటే ఆ ఇమిటేషన్‌తో అప్పుసప్పులు చేస్తే ఇ.ఎం.ఐలలో ఇరుక్కుపోతే ఆర్థిక సమస్య లు వస్తాయి. డబ్బు విషయంలో ప్రతి పైసా ఇద్దరి అవగాహనలోనే వచ్చినా, ఖర్చు అయినా మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల్లో ఎవరికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోయినా సమస్యలు పెరుగుతాయి. ఇది మరీ రిపేరు చేసుకోలేని సమస్య మాత్రం కాదు. ఆరోగ్య సమస్యలు: బిజీ లైఫ్ వల్ల ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. భర్త ఆరోగ్యం గురించి భార్య శ్రద్ధ పెట్టకపోయినా, భార్య ఆరోగ్యాన్ని భర్త పట్టించుకోకపోయినా లోలోపల ఆ కోపం ఉంటుంది. ఒకవేళ ఇరువురిలో ఒకరికి అనారోగ్యం వస్తే దాని మిషగా హర్ట్ చేసుకోవడం సూటిపోటి మాటలనడం ఇంకా ప్రమాదం. అనారోగ్యకాలంలో భార్యాభర్తల మధ్య బంధం చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతులు అవుతారు. కుటుంబ ఆరోగ్యం కూడా కా΄ాడబడుతుంది. అవాంఛిత స్నేహాలు: చేతిలో ఫోను.. ఎవరెవరితోనో స్నేహాలు.. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య చేసే స్నేహాలు (లైంగికమే కానక్కర్లేదు) కాపురానికి ప్రమాదంగా మారుతాయి. అవి మానేయమని భర్త/భార్య కోరితే మానేయడమే మంచిది. కుటుంబం కంటే ఆ స్నేహం ముఖ్యం కాదు. ఇవాళ న్యూస్పేపర్లలో వస్తున్న చాలా వార్తలు కుటుంబ జీవనంలో చోటు చేసుకుంటున్న పెను విషాదాలను చూపుతున్నాయి. కుటుంబం అందమైనది. అందరికీ అవసరమైనది. చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని నిర్వహించాలి. ఆ సంగతి అందరూ అర్థం చేసుకోవాలి. -
భారత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నా
కొలంబో: భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే(57) తెలిపారు. దేశం కనీవినీ ఎరుగని కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికంగా చేయూత అందిస్తున్న భారత్‌కు, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని భారత్ పేర్కొంది. శ్రీలంకకు సాయం కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయా కార్యాలయం ఎదుట నెల రోజులుగా సాగుతున్న నిరసనలను విరమింపజేస్తానని విక్రమసింఘె అన్నారు. అయితే ఆయన మధ్యంతర ప్రభుత్వం కొనసాగాలంటే గొటబయా గద్దె దిగాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ, జేవీపీ డిమాండ్ చేశాయి. కొత్త ప్రభుత్వంలో భాగస్వాములు కాబోమని, బయటి నుంచి మద్దతిస్తామని గొటబయాకు చెందిన ఎస్‌ఎల్‌పీపీలోని ఓ వర్గం, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ, మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరుమణ (జేవీపీ) స్పష్టం చేశాయి. 2020 పార్లమెంట్ ఎన్నికల్లో విక్రమసింఘే ఎన్నిక కానందున ఆయన ప్రభుత్వానికి చట్టబద్ధత లేదని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ వ్యాఖ్యానించింది. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)కి చెందిన విక్రమసింఘే ఒక్కరే సభ్యుడు. మరోవైపు, నిట్టంబువ పట్టణంలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఘర్షణల సమయంలో ఎస్ఎల్పీపీకి చెందిన ఎంపీ అమరకీర్తి(57)ది ఆత్మహత్య చేసుకున్నారంటూ వచ్చిన వార్తలు నిజం కాదని పోలీసులు తెలిపారు. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆయన్ను దారుణంగా కొట్టి చంపినట్లు వెల్లడించారు. -
శతక నీతి – సుమతి ‘‘..సతాం సంగో...’’ పాటించండి
ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు. దుర్యోధనుడికన్నా ప్రమాదకారి. అంత పరమదుర్మార్గుడయిన ధృతరాష్ట్రుడికి శ్రీ కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా దృష్టినిచ్చి నిండు సభలో తన విశ్వరూప దర్శనానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎందుకిచ్చాడంటే... ఆయనకున్న ఒకే ఒక అర్హత చూసి. ఆ ఒక్క సుగుణం ఏమిటి! ప్రతిరోజూ రాత్రి పరమ ధర్మాత్ముడయిన విదురుడిని పక్కన కూర్చోబెట్టుకుని మంచి మాటలు వింటాడు.. పాటించడు. కానీ విదురుడు లేకపోతే విలవిల్లాడిపోతాడు. ఆయన చెప్పేవన్నీ వింటాడు. ‘ఒక మహాత్ముడిని చేరదీసావు, ఆయనతో కలిసి ఉన్నావు, ఆయన చెప్పినవన్నీ వింటున్నావు.. ఈ ఒక్క కారణానికి నీకు విశ్వరూప సందర్శనకు అవకాశం ఇస్తున్నాను’ అన్నాడు కృష్ణ పరమాత్మ. సత్పురుషులతో సహవాసం అంత మేలు చేస్తుంది. మంచివారితో ప్రయత్నపూర్వకంగా స్నేహం చేస్తుండాలి. వారు నిన్ను పేరు పెట్టి పిలిచినా, బంధుత్వంతో పిలిచినా, నీవు వారింటికి వెళ్ళగలిగినా, వారు తరచుగా నీతో మాట్లాడుతున్నా నీవు చాలా అదృష్ట్టవంతుడివని జ్ఞాపకం పెట్టుకో... ఎందుకని అంటే... భగవంతుడు బాగా ఇష్టపడేది తనని పూజించే వాళ్లని కాదు, తాను చెప్పిన మాటలను ఆచరించేవారిని. మంచి వారితో కలిసుండే వారినే ఇష్టపడతాడు.. భాగవతంలో అజామిళోపాఖ్యానం– అనే అద్భుతమైన ఘట్టం ఒకటి ఉంది. ఎప్పుడూ మంచి పనులు చేసేవారిని.. వారినే కాదు.. వారి వారి వారి తాలూకు వారి జోలికి కూడా వెళ్ళవద్దు, వారినెవరినీ నా దగ్గరకు తీసుకుని రావద్దు–అంటాడు యమధర్మరాజు తన భటులతో...అందులో. అందుకే లోకంలో ఒక సామెత ఉంది... ‘‘అసారే ఖలు సంసారే సారమేతచ్చతుష్టయం కాశ్యం వాసః సతాం సంగో గంగభః శంభుసేవనమ్’’. ఈ నాలుగు విషయాలు చాలా గొప్పవని తెలుసుకుని బతుకు..అని బోధిస్తారు. ఇవి తెలుసుకోకపోతే అసారమైన జీవితంలో ఉండిపోతావు. అసారం..అంటే నీవెంట వచ్చేది కాదు, నీ ఆత్మోద్ధరణకు వచ్చేది కాదు, నీ జీవితాన్ని చక్కదిద్దేది కాదు. ఏవి చాలా గొప్పవి.. అంటే.. కాశీపట్టణానికి వెళ్ళి ఉండడం, సతాంసంగో–సత్పురుషులతో స్నేహం, గంగానదిలోస్నానం చేయడం, శంభుసేవనమ్–శివార్చన చేయడం. ఈ నాలుగింటికన్నా సారవంతమయినవి జీవితంలో ఉండవు. సతాంసంగో.. సత్పురుషులతో సహవాసం చాలా గొప్పది. ‘‘గంగాపాపం శశీతాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపం చ దైన్యం చ ఘ్నన్నిత్ సంతో మహాశయః’’ అంటారు. గంగలో స్నానం చేస్తే పాపాలు మాత్రమే పోతాయి, ఎంత వేసవికాలంలో అయినా శరీరంలో ఎంత తాపం కలిగినా, ఒక్కసారి చంద్రుడిని చూసి వెన్నెలలోకి చేరారనుకోండి కేవలం తాపం మాత్రం పోతుంది. కల్పవృక్షం దగ్గరకు చేరితే దరిద్రం మాత్రమే పోతుంది. అదే సత్పురుషులతో కలిసి ఉంటే పాపాలు, తాపాలు, దరిద్రం అన్నీ పోతాయి. తమ కష్టాలను పక్కనబెట్టి ఇతరుల కష్టాలను తమవిగా పరిగణిస్తారు సజ్జనులు. మీ దగ్గర ఏవో ఆశించి అలా చేయరు. అది వారి సహజ లక్షణం. దీనుల విషయంలో వారి మనసు కరిగిపోతుంది. బద్దెన గారు సుమతీ శతకంద్వారా ఇస్తున్న సందేశం కూడా ఇదే .. ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ ...’’.. దుర్జనులతో స్నేహం చేయవద్దు అని. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కశ్మీర్ ముస్లింల హక్కులపై మాట్లాడుతాం!
ఇస్లామాబాద్: కశ్మీర్ సహా ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని తాలిబన్లు ప్రకటించారు. ఒకపక్క భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోమంటూనే కశ్మీర్‌పై తాలిబన్లు కొత్త ప్రేలాపనలు మొదలుబెట్టారు. కశ్మీర్ సహా ఎక్కడ నివసించే ముస్లింల హక్కుల కోసమైనా మాట్లాడే హక్కు తమకుందని, అయితే ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలు చేపట్టే విధానం తమకు లేదని తాలిబన్లు వింత భాష్యాలు చెప్పారు. అఫ్గాన్ తిరిగి తాలిబన్ పాలనలోకి పోవడంతో భారత్‌కు ఉగ్రముప్పు పెరిగిందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సహా ప్రపంచంలో ఎక్కడ నివసించే ముస్లింల కోసమైనా మాట్లాడే హక్కు సాటి ముస్లింలుగా తమకుందన్నారు. ఇటీవలే ఖతార్‌లో భారత రాయబారితో భేటీ అయిన తాలిబన్లు..అఫ్గా్గన్ గడ్డను ఉగ్రనిలయంగా మార్చమంటూ హామీ ఇచ్చారు. కశ్మీర్ భారత అంతర్గత విషయమని, తాము జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్లు చేసిన ప్రకటనతో తాజా ప్రకటన విభేదిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే భారత వ్యతిరేక హక్కానీ నెట్‌వర్క్‌పై సైతం తాలిబన్ల స్వరం మారింది. హక్కానీలపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారాలని సుహైల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. పంజ్ షీర్ తాలిబన్ల వశం! ఇన్నాళ్లూ తమకు ఎదురు నిలిచిన పంజ్ షీర్ లోయను సైతం స్వాధీనం చేసుకున్నామని, తద్వారా మొత్తం అఫ్గానిస్తాన్‌పై పూర్తి పట్టు సాధించామని తాలిబన్ కమాండర్ ఒకరు శుక్రవారం ప్రకటించారు. పంజ్ షీర్‌లోని తిరుగుబాటుదారులపై విజయం సాధించామని చెప్పారు. కీలకమైన పంజ్ షీర్ తమ వశం కావడంతో రాజధాని కాబూల్‌లో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. పంజ్ షీర్‌ను ఆక్రమించినట్లు తాలిబన్లు చెబుతున్నప్పటికీ అధికారికంగా ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. పునర్నిర్మాణానికి చైనా సాయం చైనా తమకు అత్యంత కీలక భాగస్వామి అని, అఫ్గాన్ పునరి్నర్మాణానికి చైనా సాయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. అఫ్గాన్‌లోని ఖనిజ నిక్షేపాలు వెలికితీసి దేశానికి ఆర్థిక ఆసరా అందించేందుకు చైనా సహాయం అందిస్తుందన్నారు. చైనా ప్రతిపాదిత వన్‌బెల్ట్, వన్ రోడ్‌ను సమర్థి్ధస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వంపై నేడు ప్రకటన పెషావర్: అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు తమ ప్రకటనను ఒకరోజు వాయిదా వేశారు. శనివారం తమ నిర్ణయాన్ని వెల్ల డిస్తామని చెప్పారు. కొత్త సర్కారు అధినేతగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు తెరపైకి వచ్చింది. తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడైన బరాదర్ ప్రస్తుతం దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ చైర్మన్‌గా ఉన్నాడు. అఫ్గానిస్తాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై గత ఏడాది అమెరికాతో జరిగిన చర్చల్లో కీలకంగా వ్యవహరించాడు. ప్రమాదంలో మహిళా జడ్జీలు కాబూల్: తాలిబన్ల రాకతో అఫ్గానిస్తాన్‌లో మహిళా జడ్జీల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పలువురు నేరస్తులను ఇటీవల తాలిబన్లు విడిపించారు. దీంతో తమకు శిక్ష విధించిన మహిళా జడ్జీలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే తాలిబన్లు ఇద్దరు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారు. ఇలా ప్రమాదం అంచుల్లో ఉన్న మహిళా జడ్జీల సంఖ్య 250 వరకూ ఉంది. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోగానే కొందరు దేశాన్ని వదిలి వెళ్లిపోగా పరిస్థితులు అనుకూలించక కొందరు ఇక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు వారి ఇళ్లకు వెళ్లి తమకు శిక్ష విధించిన మహిళా జడ్జి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నట్లు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ విమెన్ జడ్జెస్ (ఐఏడబ్ల్యూజే) సభ్యులు తెలిపారు. విడుదలతోనే ప్రమాదం.. దోషులను తాలిబన్లు విడుదల చేయడంతోనే అసలు ప్రమాదం ప్రారంభమైందని అఫ్గాన్ నుంచి యూరోప్‌కు వెళ్లిన ఓ మహిళా జడ్జి చెప్పారు. జడ్జిలేగాక సామాజిక కార్యకర్తలైన మహిళలకు సైతం ముప్పు పొంచి ఉందని వివరించారు. ‘మిమ్మల్ని వెంటాడి తీరుతాం’ అని తాలిబన్లు ఇప్పటికే మహిళా పోలీసు ఆఫీసర్లకు సందేశాలు పంపినట్లు వెల్లడించారు. తమ హక్కులను కాపాడాలంటూ అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మహిళల ర్యాలీ -
భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: తాలిబన్ ప్రతినిధి
ఇస్లామాబాద్: భారత్ సహా అన్ని దేశాలతోనూ తాము సత్సంబంధాలను కోరుకుంటున్నా మని అఫ్గానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. వేరే దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడుకునేందుకు అనుతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు పాకిస్తాన్‌కు చెందిన ఏఆర్వై వార్తా చానెల్ ఒక కథనం ప్రసారం చేసింది. ‘ఈ ప్రాంతంలోని ఎంతో ముఖ్యమైన భారత్ సహా అన్ని దేశాలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. అఫ్గాన్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, భారత్ తన విధానాలకు రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాం’అని తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో ఐసిస్–కె, తెహ్రిక్ ఇ తాలిబన్ వంటి సంస్థలు బలపడటంపై ఆయన స్పందిస్తూ..‘మా భూభాగాన్ని వేరే దేశానికి వ్యతిరేకంగా వాడుకునేందుకు అనుమతించబోం. ఇదే విషయాన్ని గతంలోనూ స్పష్టం చేశాం’అని వివరించారు. చదవండి: టార్గెట్ ఐసిస్: అమెరికా వేట మొదలైంది -
చెల్లి ప్రియాంకతో రాహుల్ సరదా కబుర్లు
రాయ్‌బరేలీ: మంచి సోదరుడు ఎలా ఉండాలనే దానికి రాహుల్ కొత్త అర్థం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్, ఆయన సోదరి ప్రియాంక యూపీలోని కాన్పూర్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. అప్పుడు వీరిద్దరూ సరదాగా మాట్లాడారు. ‘మంచి సోదరుడంటే అర్థం ఏంటో చెప్తాను. ఎన్నికల ప్రచారంలో సుదూర ప్రయాణాలు చేసే నాకేమో చిన్న హెలికాప్టర్. చాలా తక్కువ దూరాలకు ప్రయాణించే ప్రియాంకకు మాత్రం సువిశాలమైన హెలికాప్టర్’ అంటూ సరదాగా అన్నారు. దీంతో ప్రియాంక ‘అంతా అబద్ధం’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘ఏదేమైనా నేను నా చెల్లిని ప్రేమిస్తున్నాను’ అని రాహుల్ మాట్లాడారు. వీరిద్దరి సరదా సంభాషణ వీడియో రాహుల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. 70 ఏళ్లలో ఏ పార్టీ గబ్బర్‌సింగ్ ట్యాక్స్ తేలేదు గత 70 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) వంటివి విధించలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు పేరుతో ప్రజలను మోసం చేశారని, ఇది ఓ అవివేకమైన చర్య అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని ఉంచాహార్లో ర్యాలీలో మాట్లాడారు. దేశంలో ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేయకుండా మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. మోదీకి ఈ ఖాళీలను భర్తీ చేయడం ఇష్టం లేదని, కేవలం ఆయన తన మిత్రులకే సాయం చేస్తారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 22 లక్షల జాబ్‌లను భర్తీ చేస్తామని.. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని ప్రకటించారు. దీనిలో కనీస మద్దతు ధర, తుపాను వంటి విపత్తులు సంభవించినప్పుడు అందించే పరిహారం, బీమా సమాచారం సహా పలు వివరాలు ఉంటాయని తెలిపారు. -
శాంతికి సిద్ధం.. కశ్మీర్ కీలకం!
ఇస్లామాబాద్: భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు తన నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. కీలమైన కశ్మీర్ వివాదం సహా అన్ని అంశాలపై ఇరుదేశాల నేతలు పరిష్కారం కుదుర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్‌లు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడానికి ముగింపు పలికి ఉపఖండంలో సుస్థిరతకు ప్రయత్నం చేయాలన్నారు. 2016లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడిన తర్వాత ఇరుదేశాల మధ్య ఇంతవరకు ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. అనంతరం కుల్‌భూషణ్ జాధవ్ అనే మాజీ నేవీ అధికారిని భారత నిఘా అధికారి అని ఆరోపిస్తూ.. ఆయనకు పాక్ కోర్టు మరణశిక్ష విధించడంతో పరిస్థితులు జఠిలంగా మారాయి. కశ్మీర్ అంశంపై.. ‘ఇరుదేశాల మధ్య సత్సంబంధాల కోసం భారత్ ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తాం. కానీ ఎవరో ఒకరు ఈ దిశగా చొరవతీసుకోవాలి’ అని ఇమ్రాన్ అన్నారు. రెండు దేశాల మధ్య కశ్మీర్ ఒక్కటే కీలకమైన అంశం. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఇరుదేశాలు సిద్ధం కావాలి. 30 ఏళ్లుగా భారత ఆర్మీ ద్వారా కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఈ సమస్యకు ముగింపు పలకాలి. ఇరుదేశాల ప్రభుత్వాలు చర్చలు జరపాలి. ఈ సమస్యపై అటూ ఇటూ తిరిగి మళ్లీ మొదటకే వస్తున్నాం’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. వాణిజ్య సంబంధాలపై ‘ఒకవేళ భారత నాయకత్వం కోరుకుంటే.. ఆ దేశంతో సంబంధాలు బలోపేతం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బెలూచిస్తాన్‌లో జరుగుతున్న దానికి భారత్‌దే బాధ్యతని.. అలాగే కశ్మీర్లో జరుగుతున్న ఘటనలకు పాకిస్తాన్ బాధ్యతంటూ ఒకరినొకరు తప్పుబట్టుకోవడం సరికాదు. ఇలాంటి ఆరోపణలతో మనం వృద్ధి చెందలేం. ఇవి ఉపఖండానికి చేటుచేస్తాయి. భారత్–పాకిస్తాన్ సత్సంబంధాలు, సరైన వాణిజ్య బంధాల ద్వారా ఈ ప్రాంతానికి చాలా మేలు జరుగుతుంది. రెండు దేశాలు ఆర్థికంగా సమృద్ధి చెందుతాయి’ అని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయ పడ్డారు. భారత మీడియాపై.. తనపై భారత మీడియా పేర్కొంటున్న కథనాలపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా భారత మీడియా నన్ను బాలీవుడ్ సినిమాల్లో విలన్ మాదిరిగా చిత్రీకరిస్తోంది. ఆ వార్తలను చూస్తుంటే చాలా బాధేస్తోంది. భారత్‌తో సత్సంబంధాలు కోరుకునే ఓ పాకిస్తానీని నేను. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వస్తే భారత్‌కు చెడు జరుగుతుందనే ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. ఓ క్రికెటర్‌గా భారత్ అంతా చుట్టేశాను. భారత్, భారత ప్రజల గురించి నాకు బాగా తెలుసు. మనం కలిస్తే ఆగ్నేయాసియాలో పేదరికాన్ని పారద్రోలవచ్చు. ఇరుదేశాల మధ్య అతిపెద్ద సమస్య కశ్మీర్. ఈ అంశంపై రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలి’ అని అన్నారు. చైనా, అరేబియా దేశాలతో దోస్తీ అమెరికాతో సత్సంబంధాలతో పాక్‌కు మేలు జరుగుతుంది. అమెరికాకు పాక్‌తో బంధాలు కాపాడుకోవడం అవసరం. ఇది పరస్పర ప్రయోజనాల అంశం. ఇరాన్, సౌదీ అరేబియాలతోనూ మా దోస్తీ కొనసాగుతుంది. చైనాతో మా బంధాలను బలోపేతం చేసుకుంటాం. చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టి వారు మాకో అవకాశాన్ని కల్పించారు. అవినీతిపై యుద్ధం, ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడంలో చైనా నుంచి మేం చాలా నేర్చుకుంటాం. ఉగ్రవాదంపై పోరు కారణంగా అఫ్గనిస్తాన్ నష్టపోయింది. ఆ దేశంలో శాంతి నెలకొనటమంటే పాక్‌లో శాంతి నెలకొన్నట్లే’ అని అన్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా! న్యూఢిల్లీ: ఆర్మీ అండదండలతో ప్రస్తుత పాక్ ఎన్నికల్లో దూసుకుపోతున్న ఇమ్రాన్ ఒకప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో ఆర్మీ జోక్యాన్ని నిరసించేవారు. కొద్దికాలానికే సైన్యంపై తన అభిప్రాయాన్ని ఆయన మార్చుకోవడంతో తాజాగా పాక్ ప్రధాని పీఠం అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. 2012లో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో మీడియాతో ఖాన్ మాట్లాడుతూ.. ‘పాక్‌లో ఆర్మీ రోజులు పోయాయి. త్వరలోనే అక్కడ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడటాన్ని మీరు చూస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూ అనంతరం 2013లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ 35 సీట్లతో చతికిలపడింది. కానీ 2018లో జరిగిన ఎన్నికల్లో పీటీఐ పాక్‌లోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేవలం ఎన్నికల ఫలితాలే కాదు.. ఈ ఐదేళ్లలో ఆర్మీ పట్ల ఇమ్రాన్ అభిప్రాయం, వ్యవహారశైలి మారాయి. ఇటీవల ‘న్యూయార్క్ టైమ్స్’ ఇంటర్వ్యూలో. ‘అది పాక్ ఆర్మీయే తప్ప శత్రు దేశపు సైన్యం కాదు. నేను ఆర్మీని కలుపుకునిపోతాను’ అని అన్నారు. భారత్‌పైనా ఇమ్రాన్ అభిప్రాయాలు మారాయి. గతంలో భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పిన ఆయన.. తాజా ఎన్నికల ప్రచారంలో భారత్ షరీఫ్‌తో కలసి పాక్ సైన్యాన్ని బలహీనపర్చేందుకు కుట్రచేస్తోందన్నారు. కశ్మీర్లో భారత సైన్యం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. మదీనాలా పాక్ పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషిచేస్తూ పాక్‌ను మదీనా తరహాలో అభివృద్ధి చేస్తానని ఇమ్రాన్ అన్నారు. ‘మహ్మద్ ప్రవక్త స్ఫూర్తితో పాకిస్తాన్‌ను మదీనాగా మారుస్తా. మానవత్వం పరిమళించే దేశంగా మారుస్తా. నేను చేపట్టే సంక్షేమపథకాలు ధనికుల కోసం కాదు. పేద ప్రజలకోసమే. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భిన్న వ్యూహాలతో ముందుకెళ్తాం. విలాసవంతమైన పాకిస్తాన్ ప్రధాని నివాసంలో నేనుండను. దాన్ని విద్యాకేంద్రంగా మారుస్తా’ అని అన్నారు. -
ట్రంప్‌ను భ్రష్టుపట్టిస్తుంది ఎవరో తెలుసా?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చేసే వ్యాఖ్యలు ఎలాంటివైనా సరే అవి చర్చనీయాంశంగా మారిపోతున్నాయి. అయితే తాను మాట్లాడింది ఒకటైతే.. మీడియా మరొకటి ప్రచురించి తన కొంప ముంచుతున్నాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో తాను సత్సంబంధాలు ఉన్నాయన్న వార్తలను ఆయన ఖండిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘కిమ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని నేను చెప్పానట. కచ్చితంగా నేను అలా అనలేదు. అదృష్టవశాత్తూ నేను సదరు విలేకరితో మాట్లాడిన సంభాషణలను రికార్డు చేయించాను. నేను ఏం మాట్లాడానో, దాని అర్థమేంటో వారికి బాగా తెలుసు. వారికి కావాల్సింది ఓ స్టోరీ మాత్రమే... ఫేక్ న్యూస్’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్విటర్లో పేర్కొన్నారు. 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ఈ మధ్య ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేయగా.. గత వారం ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో నార్త్ కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తో మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారని తెలిపింది. ఆ కథనాన్ని వైట్‌హౌజ్ ఖండించింది. చాలా అసత్యాలు ప్రచురించారని.. సరైన సమయంలో కిమ్ తో చర్చలు జరిపేందుకు కూడా తాను సిద్ధమని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారని వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. The Wall Street Journal stated falsely that I said to them “I have a good relationship with Kim Jong Un” (of N. Korea). Obviously I didn’t say that. I said “I’d have a good relationship with Kim Jong Un,” a big difference. Fortunately we now record conversations with reporters... — Donald J. Trump (@realDonaldTrump) 14 January 2018 ...and they knew exactly what I said and meant. They just wanted a story. FAKE NEWS! — Donald J. Trump (@realDonaldTrump) 14 January 2018 -
దేవుడిచ్చిన అన్న వైఎస్సార్
మాజీ హోంమంత్రి సబితారెడ్డి చేవెళ్ల: తనకు దేవుడిచ్చిన అన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి అన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆ మహానేతతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే.. ఆత్మీయత, అనురాగాన్ని పంచి ‘చేవెళ్ల చెల్లెమ్మగా’ కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిన జననేత వైఎస్. నా భర్త, మాజీమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి 2000 సంవత్సరంలో మరణించినప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన మా స్వగ్రామమైన కౌకుంట్లకు వచ్చి ఓదార్చారు. ‘మీ అన్నయ్యలా నేనున్నాను.. అధైర్యపడొద్దు అంటూ ఓదార్చిన మాటలు నాలో స్థైర్యాన్ని నింపాయి. ఇంద్రారెడ్డి మరణించినప్పుడు కోలుకోవడానికి ఎన్నేళ్లు పట్టిందో.. వైఎస్ మరణం తరువాత కూడా కోలుకోవడానికి అంతే సమయం పట్టింది. రాజశేఖర్‌రెడ్డి మా కుటుంబానికి రాజకీయంగా కాకుండా ఆత్మీయుడిగా, కుటుంబ పెద్దగా చూసుకున్నారు. ఇప్పటికీ ప్రతి అడుగులో, నేను చేసే ప్రతి పనిలో ఆయన గుర్తుకొస్తుంటారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళను హోంమంత్రిగా చేసిన ధీశాలి. నాయకుడనేవాడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవచేయాలనే ఆయన మాటలకే నాకు ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తి. నిబద్ధత, విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం ఆయన. మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ధీశాలి. ఆడపడచుగా అన్నను, రాజకీయంగా మంచి నాయకుడిని, సేవను కాంక్షించే వ్యక్తిగా సేవాతత్పరున్ని కోల్పోయానన్న బాధ ఇప్పటికీ గుండెల్లో మిగిలే ఉంది అంటూ చెమర్చిన కళ్లతో గుర్తుచేసుకున్నారు. -
దోస్త్‌మేరా దోస్త్..
అప్యాయతల అనుబంధం... ఏతోడు లేకున్నా.. చేదోడుగా నిలిచేది ‘నేస్తం’ సోషల్ మీడియాలో సందడి మార్కెట్లో గిఫ్ట్‌లు, ఫ్రెండ్షిప్ బాండ్ల హల్చల్ నేడు ఫ్రెండ్షిప్ డే కమాన్‌చౌరస్తా : మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ, అభిమానిస్తూ ఉంటారు... కానీ ప్రేమికులు కారు... ప్రాణంగా, కంటికి రెప్పలా చూసుకుంటారు కానీ... కుటుంబసభ్యులు కారు. జీవితంలోని ఆటుపోట్లు, కష్టాలను కన్నీళ్లలో పాలుపంచుకుంటారు... కానీ రక్తం పంచుకుని పుట్టినవారు కాదు.. వారే మన మేలు కోరే హితులు...స్నేహితులు. తరాలు మారినా... కాలాలు గడిచినా.. ఎల్లలు దాటినా.. అనురాగానికి, అనుబంధానికి అసలైన అర్థం.. ఆప్యాయతకు మరోభావం స్నేహం... కుల,మతాల కతీతంగా విరబూస్తున్న స్నేహంపై ప్రత్యేక కథనం. మన తల్లిదండ్రులను కూడా ఎంచుకునే వీల్లేని మనకు స్నేహితులను మాత్రం స్వయంగా ఎంచుకునే అవకాశం దేవుడు ప్రసాదించిన అపూరమైన వరం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. తప్పు చేస్తే సరైన దారిలో నడిపిస్తూ మార్గదర్శకుడవుతాడు. ప్రమాదపుటంచుల్లో ప్రాణవాయువు అవుతాడు. ఆపదలో తోడుంటాడు. భయంలో, నైరాశ్యంలో ధైర్యమిస్తుంది స్నేహం. తుది ఊపిరి విడిచేవరకు వెన్నంటే ఉండే మహత్తర బాంధవ్యం స్నేహం.. ప్రపంచమంతా కలిసి ఎదురై వచ్చినా తన స్నేహితుడిని రక్షించేందుకు ప్రాణమివ్వడానికైనా సిద్ధపడుతుంది అసలుసిసలైన స్నేహం. వాట్సాప్ గ్రూపుల్లో సందడే సందడి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రెండు, మూడురోజులనుంచి సోషల్‌మీడియా వాట్సాప్‌లో సందడి మొదలైంది. పాత స్నేహితులందరూ గ్రూప్‌గా అప్యాయతను పంచుకుంటూ స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాఫ్, ట్విట్టర్, హైక్ మెసెంజర్, లైన్‌తోపాటు పలు సోషల్ మీడియాల్లో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మధుర క్షణాలను నెమరువేసుకోవడానికి ఆధునిక సాంకేతికతను వాడుకుంటున్నారు. తమ క్లాస్మేట్లు అందరూ కలిసి వాట్సాప్‌లో ఒకగ్రూప్‌గా ఏర్పడి రోజు టచ్‌లో ఉంటున్నారు. దీనిద్వారా అ‘పూర్వ’ సమ్మేళనాలు జరుపుకుని పాత స్నేహితులను కలుసుకుని సరదాగా పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. స్నేహానికి.. కానుక కానుక మదిలో భావాన్ని వ్యక్తపరిచే అందమైన సాధనం. అనురాగంలోని గాఢతను వెల్లడించే అపురూప మాధ్యమం. అలాంటి కానుక స్నేహితులు పదికాలాలపాటు మదిలో పదిలపర్చుకునేలా ఉండాలని కోరుకుంటూ అందమైన కానుకలను స్నేహితులకు బహుకరించాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో కేకులు, గ్రీటింగ్‌కార్డులు, బాండ్లు, వాచ్‌లు, టాయ్స్, సీనరీస్, చాక్లెట్స్, సబ్లినేషన్ ప్రింట్ ఆర్టికల్స్‌తోపాటు పలు రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్వీట్‌షాపులు స్నేహితుల కోలాహలంతో మారుమోగుతున్నాయి. నగరంలోని పలు బేకరీలలో ఫ్రెండ్షిప్ డే కేకులు రెyీ గా ఉన్నాయి. లిసా నా బెస్ట్ ఫ్రెండ్ –మునిఫల్లి ఫణిత, లిసా లిసా నాబెస్ట్ ఫ్రెండ్. పదేళ్లుగా మేము స్నేహితులం. యూఎస్ఏలోని ఆర్కానాస్ రాష్ట్రాం, లిటిల్‌రాక్ ప్రాంతానికి చెందిన లీసా నాకు ఆత్మీయురాలు. ప్రతీవిషయంలో వెన్నంటి ఉండే నా చెలిమి. స్నేహితులు అందరికీ ఉంటారు. నేను ఇండియా, తను అమెరికా అయినా భాష, దేశంతో సంబంధం లేకుండా మా అనుబంధం కొనసాగుతోంది. స్నేహం కన్నా గొప్పది మరొకటి ఉండదని నా అభిప్రాయం. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలలో తన సలహాలు,సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తుంది. మన దేశ సంస్కృతి, సంప్రాదాయాలంటే చాలా గౌరవం. స్నేహితులు లేనివారుండరు –జె.సాగర్, జి.భరద్వాజ్, ఎం.వెంకటసాయి స్నేహితులు లేని వారు ఎవరుండరు. స్నేహమంటే ఈ లోకంలో చాలా విలువైన బంధం. మేము ముగ్గురం చిన్ననాటి నుంచి అంటే సుమారు 20 ఏళ్లనుంచి స్నేహితులం. తల్లిదండ్రులతో చెప్పుకోని విషయాలు, అనుభూతులు స్నేహితులతో పంచుకుంటాం. ఏటా స్నేహితులు దినోత్సవాన్ని ఘనంగా జరపుకుంటాం. మేమే కాకుండా మా స్నేహితులందరం కలిసి పరస్పరం అభినందనలు తెలుపుకుని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాం.