మాట్లాడుతున్న రావూరి ఈశ్వరరావు
చిత్తూరు కార్పొరేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సేవలను వినియోగించుకొని.. ఇప్పుడు పూర్తిగా విస్మరించారని ఆ పార్టీ సీనియర్ నేత రావూరి ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఓ సమావేశానికి హాజరైన విలేకరులతో వివిధ అంశాలపై మాట్లాడారు. 2003లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరి జిల్లా ఉపాధ్యక్షుడిగా, బీసీ విభాగం రాష్ట్ర నాయకుడిగా పలు కార్యక్రమాలు చేసినట్లు వెల్లడిం చారు. రావూరి ఈశ్వరరావు ట్రస్ట్, యువసేనను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేశానన్నారు. 750 వరకు పార్టీ కార్యక్రమాలు చేశానన్నారు.
రూ.100 కోట్ల విలువైన ఎక్స్‌పోర్ట్ వ్యాపారంలో నష్టపోయినట్లు పేర్కొన్నారు. 2004, 2009లో ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని తిరుమలలో వెంకన్న సాక్షిగా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను సైతం నిలబెట్టుకోలేదన్నారు. బీసీల్లో మంత్రి కాల్వశ్రీనివాసరావు తర్వాత రాయలసీమలో తానే ముఖ్య నాయకుడివని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తన సమస్యను మంత్రి అమరనాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేదన్నారు. తనను.. ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం పలకరించడం కూడా లేదన్నారు. టీడీపీలో బీసీలకు సముచిత స్థానం దక్కడం లేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులు, రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అందకపోవడం బాధాకరమని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment