
సాక్షి, హైదరాబాద్: హోంగార్డులకు వరాలు కురిపించిన సీఎం, వారి భద్రతపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడం త్రిశంకు స్వర్గమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. హోంగార్డుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని అనేకసార్లు చెప్పినా, ఇప్పటివరకు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద వారు ఆధారపడటం సరికాదన్నారు. 40 ఏళ్ల నుంచి సేవలందిస్తున్న హోంగార్డులను పట్టించుకున్న నాథుడే లేకుండాపోయారని, ఇప్పటికైనా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.