నితీష్ కుమార్ (ఫైల్ ఫోటో)
పాట్నా: దేశంలో మారుతున్న జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ చంపారన్ జిల్లాలో మంగళవారం థార గిరిజన తెగలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నితీష్ మాట్లాడుతూ.. 2021 నాటికి దేశంలో దళితులు, గిరిజనుల జనాభా పెరుగుతుందని, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. రిజర్వేషన్లు పెరిగితే దళిత, గిరిజనులకు మంచి అవకాశం ఉంటుందన్నారు.
గ్రామాల్లో పర్యటను వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరు తమకు రిజర్వేషన్ల కేటా ఎందుకు పెంచట్లేదని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ల పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదని, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన అంశమని పేర్కొన్నారు. కాగా నితీష్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఆర్జేడీ స్పందించింది. రిజర్వేషన్ల పేరుతో దళితులను, గిరిజనులను మభ్యపెట్టి నితీష్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆర్జేడీ నేత మృత్యుంజయ తివారి విమర్శించారు. నిజంగా గిరిజనులపై సానుభూతి ఉంటే రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వంపై ఎందకు ఒత్తిడి తీసుకురావట్లేదని మృత్యుంజయ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment