ఆసిఫాబాద్: మాట్లాడుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
రాష్ట్రానికి పట్టిన టీఆర్‌ఎస్ దయ్యాన్ని వదిలించుకుందామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన ఇచ్చోడ, కడెం, ఆసిఫాబాద్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం శనిలా దాపురించిందని అన్నారు. ఎన్నికల హామీలు విస్మరించిన కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇచ్చోడ(బోథ్): నాలుగున్నరేళ్లుగా తెలంగాణకు సోకిన టీఆర్‌ఎస్ దయ్యాన్ని వదిలించుకోవడానికి అందరూ ముందుకు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఇచ్చో డ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్ర చార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నీ ళ్లు, నిధులు, నియామకాలపేరుతో గద్దెనెక్కిన కేసీ ఆర్ వాటిని అమలు పర్చకుండా తన కుటుంబం లో నలుగురికి ఉద్యోగాలిచ్చి రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించకుండా వంద ఎకరాల్లో 150 గదుల ఇంటి ని నిర్మించుకున్నాడని ఆరోపించారు. తన కుటుం బ సభ్యుల నుంచే తనకు ప్రాణహానీ ఉందనే విషయం బుల్లెట్ ప్రూఫ్ బాత్‌రూంతో తెలుస్తుందన్నారు.
ఆదిలాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేశారని అలాంటి వారిని ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఆదివాసీ లంబాడాల మధ్య చిచ్చుపెట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏరోజు కూడా వారి సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించలేదన్నారు. ఎన్నికల్లో బోథ్‌లో సోయం బాపురావు, ఖానాపూర్‌లో రాథోడ్ రమేష్‌కు పార్టీ టికెట్లు ఇచ్చి సమస్యను పరిష్కరించే దిశగా రాహుల్‌గాంధీ కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న వారికి పహాణీలు, పట్టాలిచ్చి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రతీ నియోజవర్గానికి 100 పడకల ఆసుపత్రి, మండలానికి 30 పడకల ఆసుపత్రి, నియోజవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు అందిస్తామని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, బోథ్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు ఎక్కడ అందిందో చెప్పడానికి ఇచ్చోడ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. పెరుగన్నం తినే రైతులు పురుగు మందు అన్నం తిని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఏనాడైన జిల్లా మంత్రులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించారా? అని ప్రశ్నించారు. మరో సారి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రూ.2లక్షల కోట్లు దోచుకున్నారని మరోసారి కేసీఆర్ గెలిస్తే రూ.300 కోట్లు దోచుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారన్నారు.
బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సోయం బాపురావ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో బోథ్ కాంగ్రెస్ అభ్యర్థి సోయం బాపురావ్, మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు దుర్గం రాజేశ్వర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కుడాల స్వామి, కాంగ్రెస్ నా యకులు భార్గవ్ దేశ్‌పాం డే, సాజిద్‌ఖాన్, మల్లెపూల నర్స య్య, రాజు యాద వ్, బూర్గుల మల్లే ష్, గోక గణేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment