ఏలూరు మేయర్ నూర్జహాన్ దంపతులు(పాత చిత్రం)
పశ్చిమగోదావరి జిల్లా: వైఎస్సార్‌సీపీలో చేరిన ఏలూరు మేయర్ కుటుంబంపై అధికార పార్టీ నేతలు కక్ష్యసాధింపు చర్యలు దిగారు. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు దంపతులు రెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పెదబాబుకు చెందిన వ్యాపార హోర్డింగ్‌లను స్ధానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆదేశాలతో ప్రైవేటు వ్యక్తులతో కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతోన్నాయి.
కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే పెదబాబుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా పెదబాబు తన వ్యాపార ప్రకటనల కోసం హోర్డింగ్‌ల ఏర్పాటుకు ఏలూరు కార్పొరేషన్‌కు రూ.1.20 లక్షల నగదు కూడా చెల్లించారు. నగదు చెల్లించినా వ్యాపార ప్రకటనల హోర్డింగ్‌లు తొలగించడంపై పెదబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment