
వేంపల్లె: ఏపీలోని వైఎస్సార్ జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి అక్కడ పెద్ద దిక్కుగా ఉన్న శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎస్.వెంకట సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. మంగళవారం వేంపల్లెలోని తన స్వగృహంలో నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు. గత 25 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. గతంలో పులివెందుల నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను కూడా నిలబెట్టుకోలేని స్థితి నుంచి.. ప్రస్తుతం ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను పెట్టుకునే స్థాయికి టీడీపీని తీసుకొచ్చానన్నారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబుకు తనపై విశ్వాసం లేదన్నారు. అందువల్లే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాల ఇన్‌చార్జులు శివమోహన్‌రెడ్డి, షబ్బీర్‌వల్లి, ఈశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment