
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను ఉద్దేశించి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రమణ దీక్షుతులను బొక్కలో వేసి రెండు తగిలిస్తే సరిపోతుంది అని సోమిరెడ్డి వ్యాఖ్యనించడం నీచమైన చర్యగా అభివర్ణించారు.
ఎన్నికల్లో ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద మంత్రి అయిన సోమిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని టీడీపీ నేతలు ప్రవర్తించడం చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. రమణ దీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావు లాంటి వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితున్నారని పోలీసులతో కేసులు పెట్టిస్తే సహించబోమని హచ్చరించారు.
రమణ దీక్షితులపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి తిరుమల ఆలయం లోపల నిరసన తెలపడం బాధకరమని అన్నారు. అధికార పార్టీ రాజకీయాలు చేసి ఆలయంలో ఇలాంటి నిరసనలు చేయించడం దారుణమని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment