‘చంద్రబాబే రాజీనామా చేయాలి’ | Somu Veerraju Challenges Chandrababu On Amit Shah Letter | Sakshi
Sakshi News home page

‘ముందు చంద్రబాబే రాజీనామా చేయాలి’

Published Sat, Mar 24 2018 5:54 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Somu Veerraju Challenges Chandrababu On Amit Shah Letter - Sakshi

చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు (ఫైల్ ఫొటో)

సాక్షి, విజయవాడ: తనను రాజీనామా చేయాలంటున్న టీడీపీ నాయకులు, బీజేపీ మద్దతు, సహకారంతో అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ముందు రాజీనామా చేయించాలని బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ అధ్యక్షుడు అమిత్ షా లేఖలో పేర్కొన్న అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. టీడీపీ బహిరంగ చర్చకు వస్తే, ఆ లేఖలోని అంశాలపై మాట్లాడేందుకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. 

అబ్దద్దాలు ఆడాల్సిన కర్మ బీజేపీకి లేదన్నారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో అబద్దాలు మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు, అమిత్‌షాకు లేఖ రాస్తే మళ్లీ సమాధానం చెప్పడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్న టీడీపీ నిజంగా తెలుగు డ్రామా పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు ముందుగా తమ మద్దతుతో అధికారం చేజిక్కుంచుకున్న చంద్రబాబుతో రాజీనామా చేయించడం ఉత్తమమని సలహా ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement