
బీజేపీ నేత సోము వీర్రాజు(ఫైల్ ఫోటో)
సాక్షి, కాకినాడ : పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామరాజు, రాజమండ్రి విమానాశ్రయానికి టంగుటూరి ప్రకాశం పేరు పెట్టాలని బీజేపీ నేత సోము వీర్రాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జాతీయ ప్రాజెక్టు పోలవరంతో చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. చంద్రబాబుకు కొంచమైనా పరిజ్ఞానం ఉంటే పోలవరం ప్రాజెక్టు ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఫోటోలు పెట్టేవాడని ఎద్దేవా చేశారు.
మోదీని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. కాకినాడలో కేంద్రం ప్రతిపాదించిన హర్డ్ వేర్ పార్క్‌కి చంద్రబాబు స్థలం చూపించలేకపోయాడని ఆరోపించారు.నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో బాబు చెప్పాలన్నారు. చంద్రబాబు సర్కార్ అధిక పన్నులు వసూలు చేస్తుందని మండిపడ్డారు. మూడు రూపాయలు విలువ చేసే ఛీఫ్ లిక్కర్‌ను బాబు సర్కార్ రూ.50కి అమ్ముతుందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఆరు రూపాయలను తగ్గించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment