
తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న స్పీకర్
టేకుమట్ల: పల్లెల అభివృద్ధే నా ఎజెండా.. ప్రతీ పల్లె అభివృద్ధి చెందేవరకూ విశ్రమించనని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి(బి) గ్రామంలో పల్లె ప్రగతి నిద్ర ముగింపు సందర్భంగా ప్రతి వాడలో తిరుగుతూ ప్రజల అవసరాల ను తెలుకున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చారు. గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బండి రాజు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎవరూ చేయలేని అభివృద్ధి పనులను చేశానని, అందుకు ప్రజలే సాక్ష్యమన్నారు. కరీంనగర్ నుంచి టేకుమట్ల మండలం మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి జాతీయ రహదారి, ఓడేడు మానేరుపై అంతర్‌జిల్లా వంతెనతో గోదావరిఖని నుంచి హన్మకొండకు డబుల్ రోడ్డుతో ప్రయాణికుల రవాణాను త్వరలో మెరుగుపర్చే కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు.
రైతుల సాగు నీటికి ఇబ్బంది కలుగకుండా భారీ బడ్జెట్‌తో మానేరులో చెక్‌డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశానన్నారు. చెరువు శిఖం భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్న తీరును గ్రామస్తులు స్పీకర్‌కు తెలపడంతో స్పందించిన ఆయన వెంట నే తహసీల్దార్‌తో మాట్లాడి అక్రమార్కుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట నాయకులు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, ఏకు మల్లేష్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు ఒరంగంటి సధాకర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కూర సురేందర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నేరేళ్ల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు కొలిపాక రాజయ్య, వంగ కుమారస్వామి, రాంరెడ్డి, డాక్టర్ ఏకు నవీన్, సంగి రవి, కమురోద్ధిన్, పైడిపెల్లి సతీష్, మామిండ్ల ఎల్లస్వామి, వర్థాచారి, బందెల శ్రీనివాస్ యువజన నాయకులు అభిరాజు, తోట సాగర్, అందె కుమార్, బీనవేని ప్రభాకర్‌గౌడ్, దొడ్ల కోటి, బండమీది అశోక్, గునిగంటి మహేందర్, మల్లికార్జున్, శ్రీపతి రాకేష్, నాంపెల్లి వీరేశం, బొజ్జపెల్లి తిరుపతి, గంధం సురేష్, కిష్టస్వామి, తదితరులు పాల్గొన్నారు.