
సాక్షి, జమ్మలమడుగు : మంత్రి ఆదినారాయణరెడ్డికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సుధీర్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ‘ఆదినారాయణరెడ్డి నీకు నిజంగా దమ్ముంటే ప్రజల్లోకి రా... ఎవరు గెలుస్తారో చూద్దాం. జమ్మలమడుగుకు ఆయన చేసిందేమీ లేదు. ఆదినారాయణరెడ్డి తన బామ్మర్ది కేశవరెడ్డిని రక్షించుకునేందుకే పార్టీ మారారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన చేసిందేమీలేదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు.’ అని వ్యాఖ్యానించారు.
ఆదినారాయణరెడ్డికి సుధీర్ రెడ్డి బహిరంగ సవాల్