
వలిగొండ: మహాకూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉందని, కనీసం సీట్లు పంచుకునే స్థితిలో లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ కొంగరకలాన్‌లో నిర్వహించిన సభకు జనం నుంచి స్పందన లేకపోవడంతో నిరుత్సాహంలో పడిందన్నారు.