సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తుందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆరోపించింది. గురువారం టీజేఎస్ కార్యాలయంలో విద్యా వ్యవస్థ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నేత కపిలవాయి దిలీప్‌కుమార్, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు, విద్యార్థి విభాగం కోఆర్డినేటర్లు ఆంజనేయులు, సలీంపాషా పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీల్లో దోస్త్ విధానంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కళాశాలల్లో పోస్టులు భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. స్కూల్ ఫీజుల నియంత్రణలో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment