
సాక్షి,నెల్లూరు: భారత ఎన్నికల కమిషన్ పురుషులు, మహిళలతో పాటు థర్డ్ జండర్‌కు ఓటు హక్కు కల్పించింది. 2009 ఎన్నికల ముందు థర్డ్ జండర్‌కు ఓటు హక్కు లేదు. థర్డ్ జండర్లలో అవగాహన పెరగడం, సమాజంలో అందరితో సమానంగా జీవనం సాగిస్తున్నామని వారు అందోళన కార్యక్రమాలు చేశారు. దీంతో థర్డ్ జండర్‌కు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మంజూరు చేశారు. వాటి ఆధారంగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించారు. 2009 ఎన్నికల నుంచి థర్డ్ జండర్‌కు ఓటు హక్కు కల్పించారు. 2014 ఎన్నికల నాటికి జిల్లాలో 298 మంది ఓటు హక్కు పొందారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 338 మంది ఓటు హక్కు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment