రాజీనామా చేయనున్న కోదండరాం | TJS public meeting at Saroornagar Stadium on tommorrow | Sakshi
Sakshi News home page

రాజీనామా చేయనున్న కోదండరాం

Published Sat, Apr 28 2018 2:46 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

TJS public meeting at Saroornagar Stadium on tommorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ (రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ) చైర్మన్‌ పదవికి ప్రొఫెసర్‌ కోదండరాం రాజీనామా చేయనున్నారు. శనివారం సాయంత్రం గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద  చైర్మన్‌ పదవికి రాజీనామా చేయనున్నట్టు ఆయన తెలిపారు. మరో వైపు ఆదివారం సూరూర్‌నగర్‌ స్టేడియంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరుగనుంది.

ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను కోదండరాం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమరులను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. మార్పుకోసమే రాజకీయ పార్టీ స్థాపించినట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా రేపు జరిగే ఆవిర్భావ సభలో కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్ష భాద్యతలను చేపట్టనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement