బీజేపీ నేత కిషన్ రెడ్డి
సాక్షి, హబూబ్ నగర్ : టీఆర్‌ఎస్ తన నీడను తానే చూసి భయపడుతోందని, నాయకులకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల, పాలమూరు యూనివర్సిటీని మంగళవారం కిషన్ రెడ్డి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2019లో టీఆర్‌ఎస్‌కు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఏ వర్గాన్ని తీసుకున్నా తీవ్ర నిరాశతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ అభివృద్ధి ఎజెండా ప్రక్కన బెట్టి.. కులాల వారీగా తాత్కాలిక ప్రయోజనాల కోసం పనులు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలలో పార్టీ క్యాడర్ విస్తృతంగా పర్యటించి సమస్యలను గుర్తిస్తున్నదని చెప్పారు. అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శిస్తానని వెల్లడించారు. నాలుగేళ్లుగా ఒక్క టీచర్‌ను కూడా విశ్వవిద్యాలయాలలో నియమించలేదని తెలిపారు. అన్నింట్లోనూ నిధుల కొరత ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment