
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో జరగనుంది. ఈ నెల 5 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి హాజరు కావాలని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు.
Comments
Please login to add a commentAdd a comment