
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదని కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుతమని నీతిఆయోగ్ చెప్పినా.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. మిషన్ భగీరథను మన్‌కీ బాత్‌లో ప్రధాన మంత్రి సైతం ప్రశంసించారని గుర్తు చేశారు. ప్రశంసలు తప్ప నిధులు మాత్రం ఇవ్వడంలేదన్నారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వమంటే కేంద్రం స్పందించడంలేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment