సాక్షి, విజయవాడ : ఫైనాన్స్ వ్యాపారి గగారిన్ హత్యాహత్నం కేసులో నమ్మలేని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే గగారిన్‌పై హత్యాయత్నం జరిగిందని తెలుస్తోంది. ఆస్తి కొనుగోలు చేయడమే గగారిన్ ప్రాణాలకు ముప్పు తెచ్చిందని ఆయన కుటుంబీకులు వాపోతున్నారు. గగారిన్ కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం..మద్దాలి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి గగారిన్ ఆస్తి కొనుగోలు చేశారు. అయితే ఆ ఆస్తి విక్రయంలో ప్రసాద్, ఆయన తనయుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గగారిన్ కొనుగోలు చేసిన ఆస్తిని ప్రసాద్ కుమారులు సురేష్, సుధాకర్‌లు ఆక్రమించారు. (విజయవాడలో దారుణం.. పెట్రోల్ పోసి నిప్పంటించారు)
సదరు ఆస్తిని దక్కించుకునేందుకు గతంలో గగారిన్‌పై దాడి చేశారు. దీంతో గగారిన్ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొని చేతులు దులుపుకున్నారు. పోలీసుల వల్ల న్యాయం జరగకపోవడంతో గగారిన్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి గగారిన్‌కు అనుకూల తీర్పు వస్తుందనే ఉద్దేశంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం విజయవాడలోని గవర్నర్ పేట సమీపంలో గగారిన్‌పై ఇద్దరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో దాడి కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదని గగారిన్ కుటుంబీకులు ఆరోపించారు. పోలీసులు చిత్తశుద్దితో వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కుటుంబీకులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment