టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ మహిళల ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువుదీరిన తొలి కేబినెట్‌లో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ ముదనష్టపు పాలనలో డ్వాక్రా మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో బొంద పెట్టాలన్నారు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఈ క్రమంలో మహిళల కోసం మెనిఫెస్టోలో ప్రత్యేంగా పథకాలు చేర్చుతున్నామని తెలిపారు. (‘ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్ కర్మ’)
ఉచిత కరెంట్.. రెండు వేల పెన్షన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు లక్షల మహిళా సంఘాలకు వంద రోజుల్లో లక్ష గ్రాంట్‌లు ఇస్తామన్నారు. మహిళల ఆర్థిక సాధికారిత కోసం పదిలక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు. అభయ హస్తం పునరుద్దరించి పెన్షన్ పెంచుతామన్నారు. ఆర్వీవోలు, వీఐఐఓలకు నెలకు పదివేల వేతనం, మహిళా సంఘాల సభ్యులు వారి కుటంబ సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పిస్తామన్నారు. తెల్లకార్డు ఉన్నవారికి ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. రేషన్ ద్వారా మనిషికి ఏడు కిలోల సన్న బియ్యం, అమ్మహస్తం కింద తొమ్మది రకాలు సరుకులు ఇస్తామని వివరించారు. గిరిజనులకు 200 యూనిట్లలోపు కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు. వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేలకు, రూ.1500 వందల పెన్షన్ రూ. 3000లకు పెంచుతామన్నారు. వృద్దాప్య పెన్షన్‌లు దంపతులిద్దరిక, ప్రభుత్వ ఉద్యోగుల తల్లి దండ్రులకు కూడా పెన్షన్‌లు ఇస్తామని భరోసా ఇచ్చారు. సొంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టుకునేందుకు ఐదు లక్షల నగదు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఏడాది లక్ష ఉద్యోగాలకు నియామకం చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని హామి ఇచ్చారు. (ఉత్తమ్ డిఫెన్స్‌లో ఉద్యోగి.. కానీ సైనికుడిగా బిల్డప్!)
Comments
Please login to add a commentAdd a comment