![Vasundhara Raje Resigns As Rajasthan CM - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/11/raje-lead.jpg.webp?itok=pBfC9rEp)
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వసుంధరా రాజె తన పదవికి రాజీనామా చేశారు. హోరాహారీగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ పాలక బీజేపీని మట్టికరిపించింది. కాగా, నూతన ప్రభుత్వం రాజస్ధాన్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని వసుంధరా రాజె ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు సన్నాహాలు చేపట్టింది. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్ర అభ్యర్ధుల సహకారం కూడా తీసుకుంటామని సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తెలిపారు. రాజస్ధాన్ సీఎం రేసులో అశోక్ గెహ్లాట్‌తో పాటు యువ నేత సచిన్ పైలట్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment