
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మరో కీలక బాధ్యతను నిర్వహించనున్నారు. కీలకనేత విజయసాయిరెడ్డి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్‌కు, రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖను అందజేశారు. కొన్నిరోజుల కిందటి వరకు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment