parliamentary party leader
-
పదేళ్ల పాలన ట్రెయిలరే...: నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏను స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత బలీయమైన, విజయవంతమైన సంకీర్ణంగా నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. ‘‘మా సంకీర్ణం మూడుసార్లు పూర్తికాలం అధికారంలో కొనసాగింది. నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్డీఏ కేవలం అధికారం కోసం పుట్టుకొచ్చిన కొన్ని పార్టీల కలయిక కాదు. జాతి హితమే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన కూటమి. మేమెన్నడూ ఓడిపోలేదు. నిన్నా మేమే గెలిచాం. నేడూ మేమే గెలిచాం. భవిష్యత్తులోనూ మేమే గెలుస్తాం. విజయాన్ని ఎలా జీర్ణించుకోవాలో మాకు బాగా తెలుసు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించినా జూన్ 4 (లోక్‌సభ ఎన్నికల ఫలితాల) తర్వాత మేం వినమ్రంగా ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనం’’ అన్నారు. మరోవైపు విపక్షాలు కేవలం అధికార దాహంతోనే ఒక్కటయ్యాయంటూ ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే కలిశామని అవి స్వయంగా పేర్కొన్నాయని గుర్తు చేశారు. ‘‘ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్నే దెబ్బ తీసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ఎన్డీఏ ఎన్నికల విజయాన్ని కూడా ఓటమిగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాయి. ఫలితాలు వాటికి అనుకూలంగా రాలేదనే అక్కసుతో దేశవ్యాప్తంగా కల్లోలం రేపేందుకు కుట్ర చేశాయి’’ అంటూ మండిపడ్డారు. శుక్రవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి ఎంపీలను, అనంతరం భాగస్వామ్య పక్షాల అధినేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరం. దేశాన్ని నడిపేందుకు అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం మరింత అవసరం. పదేళ్లుగా పార్లమెంటులో నాణ్యమైన చర్చలను ఎంతగానో మిస్సయ్యా. విపక్ష నేతలు ఈసారైనా జాతి ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో అడుగు పెడతారని, అర్థవంతమైన చర్చలు చేస్తారని ఆశాభావంతో ఉన్నా’’ అన్నారు. ‘‘మన మధ్య పరస్పర వ్యతిరేకత ఉండొచ్చు. కానీ జాతి పట్ల వ్యతిరేకత ఉండకూడదు’’ అని విపక్షాలకు సూచించారు. ఎన్డీఏకు కొత్త నిర్వచనం లోక్‌సభ ఎన్నికల విజయం పట్ల ఎన్డీఏ నేతలను మోదీ అభినందించారు. ఇందుకు కారకులైన లక్షలాది మంది కార్యకర్తలకు తాను అభివాదం చేసి తీరాలన్నారు. కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ భాగస్వామ్య పక్షాలన్నింటి ఏకాభిప్రాయంతో, జాతి హితమే లక్ష్యంగా సాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. తద్వారా ప్రభుత్వాన్ని నడిపే సదవకాశమిచ్చారు. దీన్ని సది్వనియోగం చేసుకుంటామని, దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పథంలో నడుపుతామని మాటిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘పదేళ్ల పాలనలో వృద్ధి పథంలో దేశాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశాం. అదంతా కేవలం ట్రయిలర్ మాత్రమే. ఈ టర్ములో దేశాభివృద్ధి కోసం మరింతగా పాటుపడతాం. మేం కార్య సాధకులమని ప్రజలకు తెలుసు’’ అన్నారు. ‘‘సుపరిపాలనే మా కూటమికి పునాది. ఎన్డీఏ అంటే సరికొత్త (న్యూ), అభివృద్ధి చెందిన (డెవలప్డ్) , ఆకాంక్షల (ఆస్పిరేషనల్) ఇండియా’’ అని కొత్త నిర్వచనమిచ్చారు.కాంగ్రెస్‌పై చెణుకులు కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా మోదీ చెణుకులు విసిరారు. ఆ పార్టీకి గత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిపి కూడా బీజేపీకి తాజా ఎన్నికల్లో వచ్చినన్ని స్థానాలు రాలేదంటూ ఎద్దేవా చేశారు. ఈసారి ఆ పార్టీ కనీసం వంద సీట్లు కూడా నెగ్గలేకపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుత ప్రదర్శన చేసిందంటూ కొనియాడారు. ‘‘దక్షిణాదిన ఎన్డీఏ జెండా ఎగిరింది. కేరళలో తొలిసారి ఖాతా తెరిచాం. ఏపీలో చరిత్రాత్మక విజయం సాధించాం. తమిళనాడులో కూడా ఎన్డీఏ గణనీయమైన ఓట్ల శాతం సాధించాం. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అతి తక్కువ సమయంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి భారీగా సీట్లు కట్టబెట్టారు. ఇటు ఒడిశాలోనూ దుమ్ము రేపాం. అటు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ క్లీన్‌స్వీప్ చేశాం’’ అన్నారు. మంత్రి పదవులు ఇప్పిస్తామంటూ వచ్చేవారిని, ఫేక్ న్యూస్‌ను అస్సలు నమ్మొద్దని ఎన్డీఏ ఎంపీలకు మోదీ సూచించారు.ఈవీఎంలపై ఇప్పుడేమంటారు? విపక్షాలకు మోదీ చురకఇండియా కూటమి ప్రగతికి, ఆధునికతకు, టెక్నాలజీకి బద్ధ వ్యతిరేకి అని మోదీ ఆరోపించారు. విపక్షాలన్నీ గత శతాబ్దపు భావజాలంతో కొట్టుమిట్టాడుతున్నాయని, శరవేగంగా అగాథపు లోతుల్లోకి దిగజారుతున్నాయని దుయ్యబట్టారు. ఈవీఎంలపై చేసిన నిరాధార విమర్శలకు ఏం సమాధానమిస్తాయని ఎన్నికల్లో వాటి మెరుగైన ప్రదర్శనను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేందుకు ఎన్నికల ప్రక్రియ పొడవునా విపక్షాలు శక్తివంచన లేకుండా కృషి చేశాయి. సుప్రీంకోర్టులో కేసుల ద్వారా ఈసీ పనితీరును అడ్డుకోజూశాయి. వాటి తీరు చూసి ఫలితాలొచ్చాక ఏకంగా ఈవీఎంల శవయాత్ర చేస్తాయేమో అనుకున్నా! తీరా ఫలితాలు చూశాక విపక్షాల నోళ్లన్నీ మూతబడ్డాయి! ఈవీఎంలు ఇంకా బతికే ఉన్నాయా, చనిపోయాయా అని ఫలితాలొస్తున్న క్రమంలో ఒకరిని నేనడిగాను’’ అంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. దేశాన్ని అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయతి్నంచినందుకు విపక్షాలను జాతి ఎన్నటికీ క్షమించబోదన్నారు. -
ఏపీ విభజన హామీల అమల్లో కేంద్రం విఫలం: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమల్లో కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. ఈ విషయంలో కేంద్రం సవతి ప్రేమను చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో అప్రాప్రియేషన్ బిల్లు 2022పై జరిగిన చర్చలో మాట్లాడారు ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం ప్రాజెక్టు అమలు లోపభూయిష్టంగా ఉందన్నారు. ‘ఏపీ విభజన హామీల అమల్లో కేంద్రం విఫలమైంది. అన్ని అవకాశాలు ఉన్నా కేంద్రం దృష్టి పెట్టడం లేదు. ఆస్తుల పంపకం కోసం సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు అమలు లోపభూయిష్టం. దీనికి యూపీఏ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. 2010-11 రేట్లతో 2022లో ప్రాజెక్ట్ కట్టమంటున్నారు. ఏ కాంట్రాక్టర్ ముందుకొస్తారు, నష్టాలు ఎవరు భరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి ప్రేమ చూపించడం సరికాదు’ అని ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. పోలవరం పనుల సొమ్ము చెల్లింపుల్లో జాప్యం లేదు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు వెచ్చిస్తున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2014 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 15 వేల కోట్ల 970 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తంలో ఆమోదయోగ్యమైనవిగా గుర్తించిన బిల్లులకు 13 వేల కోట్ల 226 కోట్ల రూపాయల చెల్లింపు జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తనిఖీ చేసి వాటి చెల్లింపుల కోసం సిఫార్సు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని వివరించారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని 2016 సెప్టెంబర్ 30న ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అయితే ఆఫీసు మెమోరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ కింద అయిన ఖర్చు మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఆ ఖర్చును సమయానుసారం భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఇథనాల్ స్టాకు పెంపు నిరంతర ప్రక్రియ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా దేశవ్యాప్తంగా ఇథనాల్ నిల్వల సామర్ధ్యం పెంపు అనేది ఒక నిరంతరం ప్రక్రియ అని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2020-21లో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమం చేసినట్లు చెప్పారు. ఆయిల్ రిఫైనరీలు, టెర్మినల్స్, సప్లయర్ల వద్ద ఇథనాల్‌ను నిల్వ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఇథనాల్ నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ.. ఆపరేషన్ పరివర్తన్ కూడా! -
టీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా కేకే
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా డాక్టర్ కె. కేశవరావు, లోక్‌సభలో టీఆర్ఎస్ నేతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు ఎన్నికయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. రాజ్యసభలో టీఆర్ఎస్ నాయకుడిగా కేశవరావు వ్యవహరించనున్నారు. త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ భేటీలో చర్చించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగనున్న 5వ నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించింది. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం శుక్రవారం రాత్రి కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా, ఈ నెల 20న ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హోదాలో హాజరయ్యేందుకు మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశముంది. -
విజయసాయిరెడ్డికి మరో కీలక బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మరో కీలక బాధ్యతను నిర్వహించనున్నారు. కీలకనేత విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్‌కు, రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖను అందజేశారు. కొన్నిరోజుల కిందటి వరకు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
టీడీపీపీ నేత ఎంపిక అధికారం చంద్రబాబుకే
బాబు అధ్యక్షతన భేటీలో టీడీపీ ఎంపీల తీర్మానం టీడీపీపీ నేతగా అశోక్‌గజపతిరాజుకు అవకాశం? లేదంటే శివప్రసాద్, కొనకళ్ల, నిమ్మల, రాయపాటిల్లో ఒకరికి చాన్స్ సుజనాకు కేంద్రమంత్రి పదవి ఇస్తామన్న బాబు! హైదరాబాద్: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నాయకుడిని ఎంపిక చేసే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఎంపీలు కట్టబెట్టారు. టీడీపీపీ సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో టీడీపీపీ నేత ఎంపిక అంశం చర్చకు రాగానే ఆ అధికారాన్ని చంద్రబాబుకు కట్టబెడుతూ పార్టీ ఎంపీలు తీర్మానం చేశారు. గత సభలో టీడీపీపీ నేతగా నామా నాగేశ్వరరావు వ్యవహరించగా రాజ్యసభలో పార్టీ పక్ష నేతగా టి.దేవేందర్‌గౌడ్ కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఆయన్ను కొనసాగిస్తారు. ఈసారి నామా ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో కొత్త నేతను ఎన్నుకోవాల్సి వచ్చింది. టీడీపీపీ నేతగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజును నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లేదంటే ఆయన్ను లోక్‌సభలో పార్టీ పక్ష నేతగా నియమించి, టీడీపీపీ నేతగా ఎన్.శివప్రసాద్, వై.సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, రాయపాటి సాంబశివరావుల్లో ఒకరిని నియమించే అవకాశముందని సమాచారం. మరో మంత్రి పదవి వస్తుంది టీడీపీకి కేంద్ర కేబినెట్లో మరో మంత్రి పదవి దక్కుతుందని టీడీపీపీ సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అయితే అది కేబినేట్ హోదా లేదా సహాయ మంత్రి పదవా అనేది చెప్పలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో టీడీపీకి మళ్లీ అవకాశమిస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనతో అన్నారని.. ఈ పదవిని సుజనాచౌదరికి ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న ఎంపీలు కొందరు చె ప్పగా అలాంటిదేమీ లేదని మరి కొందరు పేర్కొన్నారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి మరణం వల్ల ఏర్పడిన రాజ్యసభలో రాష్ట్రం నుంచి ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే సమయంలో బీజేపీకి కేటాయించాల్సి రావచ్చని చంద్రబాబు తెలిపారు. ఈ సీటు వారికి కేటాయించటం వల్ల గతంలో జరిగిన ఒప్పందం మేరకు కేటాయించాల్సిన మూడు శాసనమండ లి సీట్లలో కోత విధించవచ్చని తెలిపారు. ముండే మృతిపట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్‌ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముండే అందించిన సేవలు మరువలేనివని.. ఆయన మృతి దేశానికి తీరని లోటని సంతాపం తెలిపారు. -
పార్లమెంటరీ పార్టీ నేత ఎంపిక వైఎస్ జగన్‌దే!
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం లోటస్ పాండ్‌లో ముగిసింది. పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే అధికారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పగిస్తూ ఎంపీలు శనివారమిక్కడ ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్లమెంట్లో రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం అంశాలవారీగా ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగితే వ్యతిరేకిస్తామన్నారు. పార్టీ ఎంపీలంతా సముచిత రీతిలో స్పందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని మేకపాటి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా తప్పకుండా హాజరు కావాలని జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
ప్రతి క్షణమూ దేశ సేవకే..
కోటి ఆశలతో ముందుకు సాగుదాం: నరేంద్రమోడీ నాపై గురుతర బాధ్యత ఉంచారు.. ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తాను వారు తలొంచుకునే పరిస్థితి రానివ్వను .. అరగంట పాటు భావోద్వేగభరిత ప్రసంగం.. అద్వానీ మాటలతో మోడీ ఉద్వేగం.. కన్నతల్లిపై దయ చూపేవాడినా అంటూ కంటతడి ఎక్కడైనా తల్లికి సేవ చేయడం దయ చూపించడం అవుతుందా? ఎన్నటికీ కాజాలదు. భారతమాత ఎలాగైతే నా మాతృమూర్తో అలాగే బీజేపీ కూడా నాకు తల్లే. తల్లిపై కుమారుడు దయ చూపించజాలడు. అంకితభావంతో సేవ మాత్రమే చేయగలడు. (పార్టీపై మోడీ దయ చూపారన్న అద్వానీ వ్యాఖ్యలపై మోడీ భావోద్వేగం) ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ప్రతి ఒక్కరి అభివృద్ధిలోనూ తోడుంటాం అన్నదే మా ప్రభుత్వ నినాదం స్వాతంత్య్ర పోరాటం చేసే అదృష్టం మనకు దక్కలేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేసే అవకాశమూ లభించలేదు. కానీ దేశం కోసం బతికే సదవకాశం మనందరికీ కలిగిందిప్పుడు న్యూఢిల్లీ: ‘‘నేను జన్మతః ఆశావాదిని. అణువణువునా ఆశావాదం నిండిన వ్యక్తిని. అది నా డీఎన్ఏలోనే ఉంది. నిరాశావాదమంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కేవలం ఒక ఆశావాది మాత్రమే ఇతరుల్లో స్ఫూర్తి, ఉత్సాహం నింపగలడు. నిరాశావాదానికి మనలో తావే ఉండకూడదు. ఎందుకంటే దానితో ఏమీ సాధించలేం. కొత్త ఆశలతో, సరికొత్త బలంతో ముందుకు సాగాల్సిన తరుణమిది’’ - దేశ 14వ ప్రధాని కాబోతున్న సందర్భంగా నరేంద్రమోడీ నోటి నుంచి జాలువారిన స్ఫూర్తిదాయకమైన మాటలివి. లోక్‌సభ ఎన్నికల్లో కమలనాథులకు ఒంటి చేత్తో అఖండ విజయం సాధించి పెట్టిన 63 ఏళ్ల మోడీ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి, ‘‘నాపై మీరుంచిన ఈ గురుతర బాధ్యతను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మనకు నిరాశ వద్దే వద్దు. గతకాలపు చేదు అనుభవాలను అధిగమించి ముందుకు సాగుదాం. అపార ప్రతిభకు మన దేశం ఆలవాలం. దేశ పౌరులమంతా కలసికట్టుగా ఒక్క అడుగు ముందుకు వేస్తే, మన దేశం ఏకంగా 125 కోట్ల అడుగులు ముందుకు వేసినట్టు’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘నా ప్రభుత్వ పనితీరును చూసి తలొంచుకోవాల్సిన పరిస్థితి మీకు ఎన్నటికీ రాదు గాక రాదు’’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. తాజా లోక్‌సభ ఎన్నికలను సామాన్యుడిలో మొలకెత్తిన కొత్త ఆశలకు ప్రతీకగా మోడీ అభివర్ణించారు. ఈ ఎన్నికల ఫలితాలిచ్చిన అతి ప్రధాన సందేశం ఇదేనన్నారు. ‘‘ఆశావాదం, బాధ్యతలతో కూడిన కొత్త శకానికి నాందీ పస్తావన జరిగింది. సామాన్యులు, అణగారిన వర్గాలు, ఏ అభివృద్ధికీ నోచుకోని అభాగ్యుల అభ్యున్నతికి నా ప్రభుత్వం త్రికరణ శుద్ధితో అంకితమవుతుంది’’ అని ప్రకటించారు. ‘‘ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ప్రతి ఒక్కరి అభివృద్ధిలోనూ తోడుంటాం’’ అన్నదే తన ప్రభుత్వ నినాదమని పేర్కొన్నారు. మోడీని తమ నేతగా ఎన్నుకునేందుకు మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ఆద్యంతం ఆనందోత్సాహాలతో సాగింది. పలు భావోద్వేగాలకూ వేదికై అలరించింది. స్వయంగా మోడీ కూడా తన ప్రసంగం మధ్యలో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ‘పార్టీపై మోడీ దయ చూపారు’ అన్న బీజేపీ భీష్ముడు అద్వానీ మాటలను గుర్తు చేసుకుంటూ కంటతడి కూడా పెట్టారు. కంఠం రుద్ధమై ఒక దశలో ప్రసంగాన్ని కొనసాగించలేకపోయారు. అనంతరం మంచినీళ్లు తాగి సేదదీరారు. బీజేపీ నూతన ఎంపీలను, రాజ్యసభ సభ్యులను, సీనియర్ నేతలను, ఎన్డీఏ మిత్రపక్షాలను ఉద్దేశించి అరగంట పాటు అనర్గళంగా ప్రసంగించారు. స్ఫూర్తిదాయకమైన మాటలతో వారిని ఆద్యంతం ఉర్రూతలూగించారు. దేశం కోసం పాటుపడదాం పదవులు, స్వపయోజనాల కోసం కాకుండా దేశ ప్రజల కోసం చిత్తశుద్ధితో పాటుపడాల్సిందిగా బీజేపీ ఎంపీలకు మోడీ పిలుపునిచ్చారు. ‘‘మనమంతా ఇప్పుడు ప్రజాస్వామిక కోవెలలో ఉన్నాం. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేద్దాం’’ అన్నారు. తన అతి సాధారణ నేపథ్యాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తనవంటి అతి సామాన్యుడు ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిలబడ్డాడన్నా, పధాని వంటి అత్యున్నత పీఠాన్ని అందుకుంటున్నాడన్నా అది కేవలం భారత ప్రజాస్వామ్యం, మన జాతి నిర్మాత గొప్పదనమేనంటూ ప్రస్తుతించారు. ‘‘అసంఖ్యాకులైన పేదలకు, అణగారిన వర్గాల వారికి, అభాగ్యులకు, కోటానుకోట్ల మంది యువతకు, గ్రామీణులకు, మన తల్లులు, సోదరీమణుల భద్రతకు కొత్త ప్రభుత్వం తనను తాను అంకితం చేసుకుంటోంది. ఇకపై అనుక్షణం వారి సంక్షేమం కోసమే చిత్తశుద్ధితో పాటుపడుతుంది’’ అని ప్రకటించారు. ‘‘ప్రజా తీర్పు హంగ్ దిశగానో, విభజితంగానో ఉంటే వారు ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వెలిగక్కారని, ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వెలువరించారని అనుకునే ఆస్కారముండేది. కానీ బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టడం ద్వారా వారు ఆశకు, నమ్మకానికి ఓటేశారు. మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మాపై వారికెన్నో అంచనాలున్నాయి. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు, నాపై ఉంచిన బాధ్యతను సజావుగా నిర్వర్తించేందుకు నా సర్వస్వం ధారపోస్తాను. శాయశక్తులా పాటుపడతాను. ఈ ప్రభుత్వం నా కోసం కాదు. దేశం కోసం. పేదల కోసం. వారి అభ్యున్నతికి ఎంతో చేయాలన్న తపన మాలో నిండుగా ఉంది’’ అని బీజేపీ నేతలు అడుగడుగునా చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రకటించారు. ప్రగతి నివేదికతో ప్రజల ముందుకు ఐదేళ్లు గడిచాక తన ప్రభుత్వ పనితీరుతో 2019లో ప్రజల ముందుకు, పార్టీ ముందుకు, ఎంపీల ముందుకు వస్తానని మోడీ ప్రకటించారు. మే 10న ఎన్నికల ప్రచార పర్వానికి తెర పడగానే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ వద్దకు వెళ్లి తన పనితీరుపై నివేదిక సమర్పించానని చెప్పుకొచ్చారు. అలాగే తన ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యాక ప్రజలకు కూడా అలాంటి ప్రోగెస్ కార్డును సమర్పిస్తానన్నారు. గత ప్రభుత్వాల పనితీరును కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతించారు. ‘‘గత ప్రభుత్వాలు ఏమి చేయలేదనే ఆలోచన నేనెప్పుడూ చేయను. దేశ ప్రగతిలో మనకు ఇప్పటిదాకా సారథ్యం వహించిన ప్రభుత్వాలన్నింటి పాత్రా ఉంది. వాటి సారథులంతా దేశ సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. వారు చేసిన మంచి పనులన్నింటినీ మేం ముందుకు తీసుకెళ్తాం’’ అన్నారు. మోడీ ఇంకా ఏమన్నారంటే... పదవులను నేనెప్పుడూ పెద్ద గౌరవంగా భావించలేదు. కార్యభారం, బాధ్యతలనేవి అన్నింటికన్నా పెద్ద విషయాలు. వాటిని నెరవేర్చేందుకు మనం సిద్ధంగా ఉండాలి. సమర్పితమవ్వాలి గత సెప్టెంబరు 13న పార్లమెంటరీ బోర్డు నాకు బాధ్యతలిచ్చింది. అప్పుడు మొదలు పెట్టిన యజ్ఞం మే 10న పూర్తయింది. పూర్తి రిపోర్టును రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశాను 125 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు, దృష్టి ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. ప్రజాస్వామ్య బలం, రాజ్యాంగ సామర్థ్యం చూడండి. ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇవాళ ఇక్కడ నిల్చున్నాడు ఎన్నికల ప్రచారంలో భారతదేశపు కొత్త రూపాన్ని చూశాను. బీజేపీ ర్యాలీల్లో కొత్త సామర్థ్యాన్ని చూశాను. వారి ఒంటిపై ఉన్నది ఒక్క వస్త్రమే అయినా.. చేతిలో బీజేపీ జెండా ఉంది. ఆశలు, ఆపేక్షలతో మన వద్దకు వచ్చారు. వారంతా అత్యంత పేదలు. వారే మనలను ఇక్కడకు పంపారు. వారి కలలను నిజం చేయాలి. పేదల గురించి ఆలోచించేది, వినేది, పేదల కోసం బతికేదే ప్రభుత్వం. ప్రజలకు వీలైనంత మంచి చేయడానికి ప్రయత్నిద్దాం. సామాన్యుల ఆశలు, ఆకాంక్షల మేరకు వారికేమైనా చేద్దాం. దేశానికి ఏమైనా ఇచ్చి వెళ్దాం. అప్పుడే దేశ ప్రజలు నిరాశ చెందకుండా ఉంటారు 2013లో ఢిల్లీలోని తోల్కతొరాలో జరిగిన కౌన్సిల్ భేటీలో నేను ఒక మాట చెప్పా... ‘హం చలే య నా చలే, దేశ్ చల్ పడా (మనం నడిచినా, నడవకపోయినా దేశం మాత్రం ముందడుగు మొదలు పెట్టింది). ఇవాళ సెంట్రల్ హాలంతా బీజేపీ సైనికులతో నిండి ఉందంటే కారణం... దేశం కదలడమే! స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే, జైలుకు వెళ్లే అవకాశం రాకపోయినప్పటికీ ఇప్పుడు దేశం కోసం జీవించే అవసరం వచ్చింది. ప్రతీక్షణం, దేహంలోని ప్రతీకణం దేశ ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఆలోచిస్తూ ముందుకు వెళితే దేశం ముందుకు నడుస్తుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విశ్వం ముందు భారత్ తలెత్తుకునేలా చేశాయి. మీకు కనిపించే మోడీ పెద్దవాడేమీ కాదు. సీనియర్ నేతలు భుజాన ఎత్తుకోవడం వల్లే ఎత్తులో కనిపిస్తున్నాడు. ఈ రోజు మనకు దక్కింది ఐదు తరాల ప్రజలు, లక్షలాది మంది కార్యకర్తల తపస్సు ఫలితం. వారి వల్లే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. మోడీ మూగవోయిన వేళ... మోడీ తన ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి భావోద్వేగానికి లోను కావడం బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో పాల్గొన్న వారందరినీ కదిలించింది. మోడీ కంటే ముందు మాట్లాడిన అద్వానీ తన ప్రసంగం సందర్భంగా ‘బీజేపీ అప్పగించిన బాధ్యతలను స్వీకరించడం ద్వారా పార్టీపై నరేంద భాయి మోడీ దయ చూపారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన ప్రసంగంలో వాటిన ప్రస్తావించిన మోడీ, ‘అద్వానీ జీ ఒక మాటన్నారు’ అంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ‘మరోసారి ఆ పదం ఉపయోగించవద్దంటూ నేను అద్వానీ జీని ప్రార్థిస్తున్నాను’ అంటూ కంటతడి పెట్టారు. భావోద్వేగంతో గొంతు పూడుకుపోగా కాసేపు మాట్లాడలేకపోయారు. డయాస్‌ను పట్టుకుని, తల వంచుకుని మౌనంగా ఉండిపోయారు. మంచినీళ్లు కావాలంటూ సంజ్ఞ చేశారు. మంచినీళ్లు తాగిన అనంతరం తేరుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘ఎక్కడైనా తల్లికి సేవ చేయడం దయ చూపించడమవుతుందా? ఎన్నటికీ కాజాలదు. భారతమాత ఎలాగైతే నా మాతృమూర్తో అలాగే బీజేపీ కూడా నాకు తల్లే. తల్లిపై కుమారుడు ఎన్నటికీ దయ చూపించజాలడు. కేవలం చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా, అంకితభావంతో సేవ మాత్రమే చేయగలడు. నిజానికి పార్టీయే నాపై దయ చూపింది. సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించింది’’ అంటూ రుద్ధమైన గొంతుతోనే మాట్లాడారు. భావోద్వేగభరితుడై మరికాసేపు మౌనంగా ఉండిపోయారు. ‘‘నన్ను ప్రధాని అభ్యర్థిని చేయడం ద్వారా బీజేపీ నాకు కట్టబెట్టిన గురుతర బాధ్యతను నెరవేర్చేందుకు నా ఒంట్లోని ప్రతి కణాన్నీ, నాకు అందుబాటులో ఉన్న సమయంలోని ప్రతి క్షణాన్నీ అంకితం చేసి మరీ పాటుపడ్డాను’’ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా దేశవ్యాప్తంగా తాను చేసిన సుడిగాలి పర్యటనలను గుర్తు చేసుకుంటూ చెప్పారు. వాజ్‌పేయి జీ వస్తే బాగుండేది అస్వస్థతతో మంచానికి పరిమితమైన కారణంగా కార్యకమానికి రాలేకపోయిన మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయిని మోడీ ఈ సందర్భంగా వినమ్రంగా గుర్తు చేసుకున్నారు. ‘అటల్జీ ఆరోగ్యంగా ఉండి ఉంటే తప్పక వచ్చి ఉండేవారు. అప్పుడు ఈ కార్యకమానికి మరింత వన్నె చేకూరేది’ అని అన్నారు. అయినప్పటికీ వాజపేయి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఉంటాయని అన్నారు. ఇదే తొలిసారి పార్లమెంటు సెంటల్ హాల్లో అడుగుపెట్టడం మోడీకి ఇదే తొలిసారి కావడం విశేషం! ఈ అంశాన్ని కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘2001లో గుజరాత్ అసెంబ్లీని కూడా రాష్ట్ర ముఖ్యమంతి హోదాలోనే నేను తొలిసారిగా సందర్శించాను. ముఖ్యమంతి కార్యాలయంలో కూడా సీఎం హోదాలోనే తొలిసారి అడుగు పెట్టాను’’ అని గుర్తు చేసుకున్నారు. పార్లమెంటులో ఘనస్వాగతం తొలిసారిగా పార్లమెంటుకు వచ్చిన మోడీకి సెంట్రల్ హాల్లో ఘన స్వాగతం లభించింది. ఆయన మంగళవారం ఉదయం 11.45 గంటలకు గుజరాత్ భవన్ నుంచి బయల్దేరి 12 గంటల సమయంలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం వద్ద స్కార్పియో వాహనం దిగారు. నాలుగో నంబరు గేటు వద్ద మెట్లకు నుదురు తాకించి మరీ అభివందనం చేసి సెంట్రల్హాల్లో అడుగు పెట్టారు. ప్రధాన ద్వారం వద్ద జైట్లీ, అమిత్ షా స్వాగతం పలికారు. సెంట్రల్ హాల్లో అద్వానీకి మోడీ పాదాభివందనం చేశారు. విశేషాలివీ.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి మోడీ ఎప్పట్లాగే తన ట్రేడ్ మార్కు కుర్తా-పైజామా, వెస్ట్ కోటుతో వచ్చారు అగ్రనేత అద్వానీకి మోడీ పాదాభివందనం చేశారు. ఆయన మోడీని లేవనెత్తి ప్రేమగా కౌగిలించుకున్నారు ఈ సందర్భంగా భావోద్వేగాన్ని ఆపుకోలేక ఎల్కే అద్వానీ కంటతడి పెట్టారు. తన జీవితంలో ఇంతటి చరిత్రాత్మక క్షణం కేవలం మోడీ వల్లే వచ్చిందన్నారు మోడీ సన్నిహితుడు అమిత్ షాను బీజేపీ నేతలంతా అభినందనలతో ముంచెత్తడం కన్పించింది లోక్‌సభకు ఎంపికైన రాజస్థాన్ సీఎం వసుంధర రాజె కుమారుడు దుష్యంత్‌సింగ్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు అభిషేక్ ప్రధానాకర్షణగా నిలిచారు. సీఎంలిద్దరూ తమ కుమారులను దగ్గరుండి ఇతర ఎంపీలకు పరిచయం చేస్తుండటం కన్పించింది. మథుర లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన డ్రీమ్‌గాళ్ హేమమాలిని కూడా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. బంగారు పువ్వుల డిజైన్‌తో కూడిన క్రీమ్ కలర్ చీరలో మెరిసిపోయారు.