సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసినట్టు చెబుతున్న లేఖను ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఆ లేఖలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్‌ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయని తెలిపారు. చంద్రబాబైనా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరని అన్నారు. ( ఆ లేఖ వెనుక రాజకీయ కుట్ర )
శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఆశచూపిన డబ్బు తీసుకోవడానికి ఓటర్లు తిరస్కరించారు. చంద్రబాబు భయపడిందిక్కడే. డబ్బు, మందు లేకుండా ఎలక్షన్లు జరిగితే జిల్లాల వారిగా సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతామన్న ఆందోళనతో డ్రామాలు మొదలు పెట్టాడు. నిమ్మగడ్డతో వాయిదా నాటకం ఆడించాడు. తన మనుగడ కోసం చంద్రబాబు కులం, ప్రాంతం కార్డులను వాడతాడు. ఆయనను నమ్మి చెప్పినట్టు చేసిన వారు తర్వాత సస్పెన్షన్లు, కేసులు ఎదుర్కోవడం చూస్తున్నాం. అయినా సూసైడ్ స్క్వాడ్ సభ్యులు కులదైవం కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. వీళ్ల ఆటలు కొద్ది రోజులు సాగినా చివరకు చట్టాల ముందు తలొంచాల్సిందే’’నని పేర్కొన్నారు. ( ‘ఆ లేఖ బాబు ఆఫీసులో తయారు చేశారు!’ )
Comments
Please login to add a commentAdd a comment