సాక్షి, విజయవాడ : నగర కార్పొరేషన్‌లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ తీవ్రస్థాయికి చేరింది. కార్పొరేషన్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలను తొలగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు అధికారులు. దీనిపై నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడకుండా హాల్లో చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలు ఎందుకు తీశారంటూ అధికారులపై చిందులేశారు. ఎన్టీఆర్ ఫోటో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ ఫోటో పెడితే వైఎస్సార్ ఫోటో కూడా పెట్టాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇద్దరు మాజీ సీఎంలే కాబట్టి ఒద్దరివి పెట్టాలని మేయర్ పోడియం వద్ద వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. కార్పొరేషన్ తనదని, తాను చెప్పిందే చేయాలంటూ అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment