మాయవతి (ఫైల్ ఫోటో)
లక్నో : ఇక నుంచి తాము కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్లు అడుక్కోవాల్సిన అవసరం లేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తేల్చిచెప్పారు. త్వరలో ఎన్నికలు జరుగునున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి.. తాను ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ఇటీవల మాయవతి ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై మంగళవారం ఆమె మరోసారి పలు వ్యాఖ్యలు చేశారు. సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ముందు పాకులాడాల్సిన అవసరం తమకు లేదని, బీఎస్పీ కేవలం గౌరవప్రదమైన సీట్లు మాత్రమే ఆశించిందని అన్నారు. కాంగ్రెస్ మాత్రం మధ్యప్రదేశ్‌లో 10, రాజస్తాన్‌లో 9, ఛత్తీస్‌గఢ్‌లో 6 సీట్లు మాత్రమే ఇస్తామని తమను తక్కువ చూపు చూసిందని మాయా ఆరోపించారు.
బీజేపీ సహా కాంగ్రెస్‌తో కూడా బీఎస్పీని టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో కూడా తాను ఒంటరిగానే పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం అనూహ్యంగా అజిత్‌సింగ్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీలతో మాయా జట్టుకట్టారు. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి మాయావతి రూపంలో పెద్ద షాకే తగిలింది. మాయవతి వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మాత్రం భిన్నంగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో మాయావతితో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment