
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలు గాలి కొదిలేసి ఆత్మస్తుతి, పరనిందలతో అసెంబ్లీ సమావేశాలను నీరుగార్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. గంటల తరబడి చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలతో సమావేశాలు కొనసాగిస్తున్నా రని దుయ్యబట్టారు. ప్రతిపక్షం సభలో లేదనే ధైర్యంతో అసెంబ్లీని టీడీపీ సమావేశాల వేదికలా మార్చేశారని ఎండగట్టారు. శనివారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ జరగక అన్నదాతలు, డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న అవస్థలు లాంటి ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బీఏసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై చర్చించాలని వైఎస్సా ర్‌సీపీ కోరుతూ వచ్చినా పరిగణనలోకి తీసుకో లేదని, ప్రజా సమస్యలపై చర్చ కోసం సభను రెండు రోజులు పొడి గించాలని కోరితే కనీసం వినిపించు కోలేదన్నారు.
ఇప్పుడు బాబు తనను పొగిడించు కోవడం కోసం అసెంబ్లీ సమావేశాలను పొడిగించార న్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని గడికోట తప్పుబట్టారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో ఒంటిమిట్టలో నలుగురి ప్రాణాలు గాలిలో కలిశాయని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట రామాలయ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు గతంలో గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలితీసుకున్నారని, ఇప్పుడు నలుగు రిని పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా పెంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని పార్టీ తరుపున ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment