అరాచకం సాగుతోంది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచకవాదిగా మారి తన పార్టీ అ నుయాయులతో తప్పుడు కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించేలా చేసి తమ పార్టీకి చెందిన 11 మంది కార్యకర్తలను, నాయకులను హత్యలు చేయించారని, దాడుల్లో మరో 200మంది గాయాలపాలై ఆసుపత్రుల పాల య్యారని, అందుకే ఇవి ప్రభుత్వం చేసే హత్యలుగా తాము పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గడికోట సోమవారం శాసనసభ మీడి యా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు.
ఎవరివి హత్యారాజకీయాలో ప్రజలకు తెలుసన్నారు. స్వయంగా స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తు న్న నియోజకవర్గంలో మైనారిటీ ఎమ్మెల్యే ము స్తాఫా, పార్టీ నాయకులు అంబటి రాంబాబుతో కలసి రక్షణ కోరితే దిక్కులేదన్నారు. మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యకర్త లాల్‌బాషా పార్టీ మారి టీడీపీలోకి వస్తే చాలంటూ ఆ పార్టీ కార్యకర్తలా వీరంగం తొక్కి న ఎస్‌ఐ రాయబారం నడిపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా పత్రికల్లో వచ్చిన కథనాలు చూపుతూ నెల్లూరు, గుం టూరు, ప్రకాశం, కర్నూలు ఇలా ఎక్కడ పడితే అక్కడ టీడీపీ దాష్టీకాలు పెచ్చుమీరాయన్నారు.
రక్తాంధ్రప్రదేశ్‌గా చేస్తున్నారు...
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ బాబు రెండు నెలల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేద న్నారు. శాంతిభద్రతలపై సభలో చర్చించాల్సిందేనన్నారు. రాష్ట్రంలో ఆరాచకం రాజ్యమేలుతోందని.. నవీనాంధ్రప్రదేశ్ చేస్తాన న్న సీఎం రక్తాంధ్రప్రదేశ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దిక్కూమొక్కూ లేని పాలన సాగుతోంది...
మరో ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో తనను హత్య చేసేందుకు సైతం టీడీపీ గూండాలు వెనుకాడలేదని, సినీ ఫక్కీలో వచ్చి బస్సు అద్దాలు పగులగొట్టి మహిళను ఈడ్చుకెళ్లినా దిక్కూమొక్కూలేని పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అందుకే సభలో చర్చ జరగాలని అడుగుతున్నామన్నారు. కదిరి ఎమ్మెల్యే జాన్ బాషా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రత్యర్థులను భయపెట్టి పాలన సాగిస్తోం దని, అందుకే సభ లో చర్చ జరిగితే లోకానికి తెలుస్తుందని పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, ఉప్పులేటి కల్పన, శ్రీధర్‌రెడ్డిలు కూడా టీడీపీ, ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.