ఆర్మూర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంట్ నియో జకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన 50 మం ది పసుపు రైతులు శనివారం వారణాసికి చేరుకున్నా రు. పసుపు రైతుల సమస్యలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడం కోసం వారణాసి నుంచి బరిలో నిలవాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన పసుపు రైతులు శనివారం వారణాసికి చేరుకున్నారు.
పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసే స్వతంత్ర అభ్యర్థిని బలపరుస్తూ స్థానిక ఓటర్లు తమ వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే పసుపు రైతులు పలువురి మద్దతు కూడగట్టుకున్నప్పటికీ అక్కడి పోలీసులు మద్దతుదారులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు పలువురు రైతు నాయకులను అరెస్టు చేశారని పసుపు రైతులు ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. తెలంగాణ పసుపు రైతులకు మద్దతుగా తమిళనాడుకు చెందిన పసుపు రైతులు సైతం శనివారం వారణాసికి చేరుకున్నారని చెప్పారు. ఈ నెల 29లోగా నామినేషన్లు సమర్పిస్తామన్నారు. కాగా, తమిళనాడులోని ఈరోడ్ ప్రాం తానికి చెందిన పసుపు రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు దైవశిగామణి సహకారంతో వారణాసిలో నామినేషన్లు వేయడానికి పూనుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment