
సాక్షి, విశాఖపట్నం : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ‘‘ప్రజాసంకల్పయాత్ర’’ 250వ రోజుకు చేరుకుంది. గత ఏడాది నవంజర్ 6వతేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 జిల్లాల్లో దిగ్విజయంగా పూర్తైన పాదయాత్ర ప్రస్తుతం 11వ జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు జననేత 2842కి.మీ నడిచారు. నేడు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర సాగుతోంది. అలుపెరగకుండా నిర్విరామంగా 9నెలలకుపైగా నడుస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిచోటా ప్రజలతో మమేకవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు.
నానాటికి ప్రజా సంకల్పయాత్రకు ఆదరణ పెరుగుతూపోతోంది. అందుకే జననేతకు ప్రతిచోటా విజ్ఞప్తులు వెల్లువగా వస్తున్నాయి. ఇక ఇవాళ విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకర్గం, తుమ్మలపాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మార్టూరు క్రాస్, బవులవాడ, త్రిమూర్తులు నగర్ మీదగా దర్జీనగర్ వరకు సాగిన పాదయాత్రకు ప్రజలు నీరాజనం పట్టారు. ఎక్కడికక్కడ జననేతకు స్వాగతం చెప్పేందుకు మహిళలు బారులు తీరుతున్నారు. మహిళలే కాక దివ్యాంగులు, వృద్ధులు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. విద్యార్థినీ, విద్యార్థులు సైతం జననేతతో సెల్ఫీలు దిగి మురిసిపోతున్నారు. ముస్లిం సోదరులు సైతం తమ వంతుగా ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం ప్రకటించి జననేతతో కలిసి ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment