
సాక్షి, నిడదవోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కానూరు క్రాస్ రోడ్డుకు రాజన్న బిడ్డ పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రికి జననేత ఇక్కడే బస చేస్తారు.
ఇప్పటివరకు పాదయాత్రలో జననేత 2,268.4 కిలోమీటర్లు నడిచారు. జడివానను సైతం లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.