వైఎస్సార్‌సీపీ దళపతులు | YSRCP Candidates List Visakhapatnam | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ దళపతులు

Published Mon, Mar 18 2019 11:59 AM | Last Updated on Mon, Mar 18 2019 11:59 AM

YSRCP Candidates List Visakhapatnam - Sakshi

జాబితా విడుదలైంది.. విజయం మనదే అంటూ జగన్‌ సేన సిద్ధమైంది..నవరత్నాలు వంటి పథకాలు ఇప్పటికే జనంలోకి బాగా వెళ్లగా రెట్టించినఉత్సాహంతో వైఎస్సార్‌సీపీ దళపతులు పోటీకి సై అంటున్నారు. రాజకీయకుట్రలను దునుమాడుతూ.. ప్రజా కంటక పాలనను అంతమొందిస్తూ.. జనంకలలను నిజం చేసే మధుర క్షణాల కోసం ఇన్నాళ్ల పోరాటం.. ఇన్నాళ్లనిరీక్షణ సఫలమయ్యేలా రాజకీయ రణరంగంలోకి
ప్రవేశిస్తున్నారు. పాత కొత్తల మేలు కలయికతోసాగిన అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా హర్షంవ్యక్తమవుతోంది. ఇక ఎన్నికల క్రతువే మిగిలింది.

అనకాపల్లి ఎంపీ : కాండ్రేగుల సత్యవతి
విద్యార్హత: ఎంబీబీఎస్, గైనకాలజిస్ట్‌
వయసు: 52
కుటుంబ సభ్యులు: భర్త పేరు కాండ్రేగులవిష్ణుమూర్తి(డాక్టర్‌), కుమారుడు యశ్వంత్‌(డాక్టర్‌), కుమార్తె పావని( డాక్టర్‌).
రాజకీయ నేపథ్యం: 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
నిర్వహించిన పదవులు: రోటరీ ఒకేషనల్‌ అవార్డు, భారతవికాస పరిషత్‌ టాప్‌ డాక్టర్‌ ఆఫ్‌ ది టౌన్, వైఎంసీఏ డాక్టర్‌ ఆఫ్‌ ది మిలీనియం, రెండు నెలల క్రితం వైఎస్సార్‌సీపీ చేరారు.

విశాఖ ఎంపీ :ముళ్లపూడివీర వెంకట సత్యనారాయణ
విద్యార్హత: డిగ్రీ
వయసు: 54
కుటుంబ సభ్యులు: భార్య నాగ జ్యోతి,  కుమారుడు శరత్‌.
రాజకీయ నేపథ్యం: ఆరు నెలలు క్రితం వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. విశాఖ పార్లమెంట్‌ సమన్వయకర్తగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నిర్వహించిన పదవులు: విశాఖ బిల్డర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా రెండు దఫాలు వ్యవహరించారు.

అరకు ఎంపీ: గొట్టేటి మాధవి
విద్యార్హత: బీయస్సీ,బీపీఈడి
వయసు: 27
కుటుంబ సభ్యులు:  తండ్రి పేరు గొడ్డేటి దేముడు( దివంగత మాజీ ఎమ్మెల్యే), అమ్మ పేరు చెల్లయ్యమ్మ.
రాజకీయ నేపథ్యం: ఈమె తండ్రి చింతపల్లి శాసన సభ్యుడిగా రెండు పర్యాయాలు పని చేశారు. 2018 ఆగష్టు 27 వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరింది.
నిర్వహించిన పదవులు: వైఎస్సార్‌ సీపీ అరకు పార్లమెంట్‌ సమన్వయకర్త.

భీమిలి :ముత్తంశెట్టి శ్రీనివాసరావు
విద్యార్హత: ఎం.ఏ., ఎల్‌ఎల్‌బీ
వయసు:52
కుటుంబ సభ్యులు: భార్య జ్ఞానేశ్వరి, కుమార్తె ప్రియాంక, కుమారుడు వెంకట శివనందేష్‌
రాజకీయ నేపథ్యం: అవంతి విద్యాసంస్థల అధినేత. 2009లో రాజకీయ ప్రవేశం.
నిర్వహించిన పదవులు: 2009–2014 వరకూ భీమిలి ఎమ్మెల్యే, 2014–2019 వరకూ అనకాపల్లి ఎంపీగా పనిచేశారు.

పెందుర్తి :అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌
విద్యార్హత: ఎంబీఏ, వయసు:36
కుటుంబ సభ్యులు: భార్య శిరీష, కుమారుడు సత్యధన్విరాజ్‌
రాజకీయ నేపథ్యం: వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.
నిర్వహించిన పదవులు: రాంపురం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ హయాంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో  వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు.

గాజువాక :తిప్పల నాగిరెడ్డి
విద్యార్హత:ఇంటర్మీడియట్‌ వయసు:65
కుటుంబ సభ్యులు: భార్య రాధ, కుమార్తె కవిత, కుమారులు వంశీరెడ్డి, దేవన్‌రెడ్డి
రాజకీయ నేపథ్యం: వీఏఓగా పనిచేస్తూ.. ఆ వ్యవస్థను రద్దు చేయడంతో 1984లో కాంగ్రెస్‌లో చేరారు.  
నిర్వహించిన పదవులు: 2007 జీవీఎంసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. విశాఖ గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి, వీఏవో సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.

విశాఖ తూర్పు : అక్కరమాని విజయనిర్మల
విద్యార్హత: ఇంటర్మీడియట్, వయసు : 47         
కుటుంబ సభ్యులు: భర్త వెంకటరావు, కుమార్తె భారతి, కుమారుడు అవినాష్‌
రాజకీయ నేపథ్యం: 2005లో రాజకీయ ప్రవేశం.
నిర్వహించిన పదవులు: 2005లో భీమిలి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలుపొందారు. అదే ఏడాది మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2008–2010 వరకూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

విశాఖ పశ్చిమ : మళ్ల విజయప్రసాద్‌
విద్యార్హత: డిగ్రీ
వయసు:53
కుటుంబ సభ్యులు: భార్య అరుణకుమారి, కుమార్తెలు అనూష, అలేఖ్య
రాజకీయ నేపథ్యం: వెల్ఫేర్‌ గ్రూప్‌ ఆఫ్‌ సంస్థ అధినేతగా ఉంటూ 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  
నిర్వహించిన పదవులు: 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

విశాఖ దక్షిణ : ద్రోణంరాజు శ్రీనివాస్‌
విద్యార్హత: బి.కాం., బీఎల్‌
వయసు:58
కుటుంబ సభ్యులు: భార్య శశి, కుమారుడు శ్రీవత్సవ, కుమార్తె శ్వేత,
రాజకీయ నేపథ్యం: తండ్రి ద్రోణం రాజు సత్యనారాయణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత. తండ్రి మరణాననంతరం శ్రీనివాస్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
నిర్వహించిన పదవులు 2006లో జరిగిన ఉప ఎన్నికలో ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతవరకూ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేశారు.

విశాఖ ఉత్తర : కేకే రాజు
విద్యార్హత: బీఏ,  వయసు:42
కుటుంబ సభ్యులు: భార్య సుమ, కుమార్తెలు సాత్విక, హాన్విక
రాజకీయ నేపథ్యం: 2014 నుంచి వైఎస్సార్‌ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
నిర్వహించిన పదవులు: ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు.

మాడుగుల : బూడి ముత్యాలనాయుడు
విద్యార్హత: ఇంటర్మీడియట్‌
వయసు : 57   కుటుంబ సభ్యులు: భార్య రమణమ్మ
రాజకీయ నేపథ్యం: 1984లో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా రాజకీయ ప్రవేశం చేశారు. రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ జాయింట్‌ కన్వీనర్, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తదితర పదవులు నిర్వహించారు.
నిర్వహించిన పదవులు: తారువా గ్రామ సర్పంచ్, ములకలాపల్లి ఎంపీటీసీ సభ్యుడు, దేవరాపల్లి మండల పరిషత్‌ అధ్యక్ష పదవులు చేపట్టారు.

అరకులోయ :చెట్టి పాల్గుణ
విద్యార్హత: ఎం.ఏ. పాలిటిక్స్,  వయసు:57
కుటుంబ సభ్యులు: భార్య అనురాధ, కుమారులు వికాస్, వినయ్, సాయి శ్రీనివాస్‌
రాజకీయ నేపథ్యం: టీచర్‌గా చేరి..1984లో ఎస్‌బీఐ క్లర్క్‌గా పనిచేసి..33 ఏళ్ల తరువాత బ్యాంకు మేనేజర్‌గా పదోన్నతి పొందారు. తరువాత రాజీనామా చేశారు. 2017లో వైఎస్సార్‌ సీపీలో చేరారు.
నిర్వహించిన పదవులు: మన్యప్రజల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

పాడేరు :కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
విద్యార్హత: ఎమ్మెస్సీ బయోటెక్నాలజి, బీఈడీ
వయసు:34
కుటుంబ సభ్యులు: భర్త తమర్భ నర్సింగరావు, కుమారుడు వివేక్, కుమార్తెలు జస్మితశ్రీనందన గాయిత్రి
రాజకీయ నేపథ్యం: దివంగత మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు కుమార్తె భాగ్యలక్ష్మి.   వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌లో చేరారు. 2009 నుంచి 2014 వరకు ట్రైఫాడ్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు.  
నిర్వహించిన పదవులు: అరకు పార్లమెంట్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పని చేశారు. 2014 నుంచి 2017 వరకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2017లో వైఎస్సార్‌సీలో చేరారు.

నర్సీపట్నం: పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌
విద్యార్హత: బీఏ,   వయసు: 47
కుటుంబ సభ్యులు: భార్య కళావతి, కుమారులు అవినాష్, ఆదర్శ్‌
రాజకీయ నేపథ్యం: 1992లో టీడీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో ప్రారంభం నుంచి ఉన్నారు.
నిర్వహించిన పదవులు: బాపిరాజు కొత్తపల్లి సర్పంచ్‌గా 1995 నుంచి 2001 వరకు, తాండవ ఆయకట్టు సంఘం చైర్మన్‌గా 2009 నుంచి 2012 వరకు పనిచేశారు.

యలమంచిలి : ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు)
విద్యార్హత: బీకాం డిస్కంటిన్యూ.., వయసు:67
కుటుంబ సభ్యులు: రాధాదేవి, సుకుమారవర్మ, కుమార్తెలు రోజారాణి, రూపారాణి
రాజకీయ నేపథ్యం: రాజకీయాల్లోకి రాకముందు కాంట్రాక్టర్‌ ఉండేవారు. 1999లో రాజకీయ ప్రవేశం చేశారు.
నిర్వహించిన పదవులు: 2004,2009లో వరుసుగా కాంగ్రెస్‌ పార్టీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైఎస్సార్‌ సీపీలో చేరి ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు.

పాయకరావుపేట :గొల్ల బాబూరావు
విద్యార్హత: ఎం.ఏ., ఎల్‌ఎల్‌బీ,    వయసు:65
కుటుంబ సభ్యులు: భార్య వసంతకుమారి, కుమారుడు సాయికార్తీక్, కుమార్తె నాగసౌమ్య
రాజకీయ నేపథ్యం: పంచాయతీరాజ్‌ అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2009,2012 (ఉప ఎన్నిక) ఎమ్మెల్యేగాగా పనిచేశారు.
నిర్వహించిన పదవులు: 2011 నుంచి వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

చోడవరం :కరణం ధర్మశ్రీ
విద్యార్హత: బీఏ, బీఎడ్, బీఎల్‌
వయసు: 51
కుటుంబ సభ్యులు: భార్య వెంకట విజయ, కుమార్తెలు కుసువు, స్వాతి, కుమారుడు సూర్య
రాజకీయ నేపథ్యం: 1997లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్ష పదవితోపాటు అనేక పార్టీ పదవులు చేపట్టారు.
నిర్వహించిన పదవులు: 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరపున మాడుగుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అనకాపల్లి :గుడివాడ అమర్‌నాథ్‌
విద్యార్హత: ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు
వయసు: 35
కుటుంబ సభ్యులు: తండ్రి దివంగత మంత్రి గుడివాడ గురునాథరావు, తల్లి నాగమణి
రాజకీయ నేపథ్యం: 21 ఏళ్లకే రాజకీయ అరంగేట్రం చేసి, 2007లో టీడీపీ చేరారు.
నిర్వహించిన పదవులు: 2007లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 65వ వార్డు కార్పొరేటర్‌గా గెలుపొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement