వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్
కడప లోక్‌సభ అభ్యర్థి
పేరు : వైఎస్ అవినాష్‌రెడ్డి
పుట్టిన తేదీ : 27–08–1984
విద్యార్హత : ఎంబీఏ
తల్లిదండ్రులు : వైఎస్ భాస్కర్‌రెడ్డి, లక్ష్మి
స్వస్థలం: పులివెందుల
భార్య : సమతా రెడ్డి
సంతానం : విక్రాంత్ రెడ్డి (కుమారుడు)
రాజకీయ ప్రవేశం
2014లో వైఎస్సార్సీపీ తరపున కడప లోక్ సభ అభ్యర్థిగా గెలుపొందారు.
గుంటూరు ఎంపీ అభ్యర్థి
అభ్యర్థి పేరు : మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (52)
తల్లిదండ్రులు : పాపిరెడ్డి, ఆదిలక్ష్మీ
భార్య : మాధవికృష్ణ
కుమారులు : సాకేత్రామిరెడ్డి, ప్రణవ్సుబ్బారెడ్డి
విద్యార్హత : బీకాం, ఎల్ఎల్బీ
ఊరు : కృష్ణనగర్, గుంటూరు
వృత్తి : వ్యాపారవేత్త
నేపథ్యం: మోదుగుల వేణుగోపాలరెడ్డి 2009లో నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ తరఫున గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లనున్నారు.
నరసరావుపేట ఎంపీ అభ్యర్థి
అభ్యర్థి పేరు : లావు శ్రీకృష్ణ దేవరాయలు (35)
తల్లిదండ్రులు : డాక్టర్ లావు రత్తయ్య, నిర్మల
భార్య : డాక్టర్ మేఘన (కంటి వైద్యులు)
కుమారుడు : లావు రతన్
విద్యార్హత : మీడియా స్టడీస్ (ఆస్ట్రేలియా)
ఊరు : గుంటూరు
నేపథ్యం: లావు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్‌గా, శ్రీ సోమనాథ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఏలూరులో సీబీఎస్ఇ సీల్‌బస్‌తో నడుస్తున్న స్కూల్‌కి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈఎస్ఎస్ వీఇఇ ఏఏఆర్ కే ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్(ఏలూరు)డైరక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రజాసేవపై మక్కువతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
బాపట్ల ఎంపీ అభ్యర్థి
అభ్యర్థి పేరు : నందిగం సురేష్‌బాబు (42)
తల్లిదండ్రులు : నందిగం పౌలు, సంతోషమ్మ
భార్య : బేబిలత
సంతానం : ప్రిన్సి, గ్లోరి సురేఖ
విద్యార్హత : ఎస్ఎస్సీ
ఊరు : ఉద్దండరాయనిపాలెం (తుళ్లూరు మండలం)
నేపథ్యం: నందిగం సురేష్ చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. పార్టీలో సామాన్య కర్యకర్తగా నిబద్ధతతో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన క్రమశిక్షణ, నిజాయితీని చూసి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నియమించారు. రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు పంట పొలాలను తగుబెట్టిన విషయంలో పార్టీ తరఫున, రైతాంగానికి అండగా నిలిచారు.
విజయవాడ ఎంపీ అభ్యర్థి
పేరు : పొట్లూరి వర ప్రసాద్
తల్లిదండ్రులు: రాఘవేందరావు, మంగతాయారు
విద్య: విజయవాడలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య, ఆంధ్రా లయోల కళా శాలలో కళాశాల వి ద్య, నాగార్జున యూని వర్సిటీ నుంచి మెకాని కల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆస్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ నుంచి 1995లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
పుట్టిన తేది: 8–9–1970
పుట్టిన ఊరు: విజయవాడ
నేపథ్యం: యుఎస్ మిచిగాన్‌లో ప్రొకోన్, అల్బియన్ ఓరియన్ అనే ఐటీ సేవల సంస్థను నెలకొల్పారు. 2001లో ‘ఇరెవ్నా అనే ఎనలిటిక్స్’ను యుకేలో ప్రారంభించారు. ఆ తరువాత పీవీపీ మీడియా, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, రంగాల పై అధికంగా దృష్టి కేంద్రీకరించారు.
మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి
పేరు: వల్లభనేని బాలశౌరి
భార్య పేరు: భానుమతి
సంతానం: ముగ్గురు కుమారులు(అనుదీప్, అరుణ్, అఖిల్)
విద్యార్హతలు: ఎంఏ(పొలిటికల్ సైన్స్)
పుట్టిన తేదీ: సెప్టెంబరు 18,1968
నేపథ్యం : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తొలి ప్రయత్నంలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. 14వ లోక్‌సభ సమయంలో పార్లమెంట్ రక్షణ శాఖ, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కౌన్సిల్ మెంబర్‌గా సేవలందించారు. తెనాలి ఎంపీగా ఉన్న కాలంలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ఉత్తమ సేవలు అందించి తన ప్రత్యేకత చాటుకున్నారు.
ఏలూరు ఎంపీ అభ్యర్థి
పేరు : కోటగిరి శ్రీధర్
స్వస్దలం : కృష్ణాజిల్లా, నూజివీడు
నివాసం : ఏలూరు
పుట్టిన తేది : 1973
విద్యార్హత : బీబీఎం
తండ్రి పేరు : కోటగిరి విద్యాధరరావు
తల్లి పేరు : విజయకుమారి
భార్య : సరిత
పిల్లలు : దేవన్, కావేరి
వృత్తి : వ్యాపారం
రాజకీయ ప్రవేశం: తొలుత బీజేపీలో క్రియాశీలక రాజకీయరంగ ప్రవేశం చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై చేపడుతోన్న పోరాటాలు, ఉద్యమాలు, వైఎస్ జగన్ ఆశయాలపై ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
నంద్యాల ఎంపీ అభ్యర్థి
పేరు : పోచా బ్రహ్మానందరెడ్డి
తల్లిదండ్రులు : ఈశ్వరమ్మ, వెంకటరెడ్డి
స్వగ్రామం : ఉయ్యాలవాడ (గ్రామం), ఆళ్లగడ్డ నియోజకవర్గం
పుట్టిన తేదీ : 01–01–1954
చదువు : ఎమ్మెస్సీ (అగ్రికల్చర్)
కుటుంబ సభ్యులు : భార్య రామపుల్లమ్మ, కుమార్తెలు మీనాక్షి, దేవమ్మ, వాణెమ్మ, కుమారుడు జనార్దన్‌రెడ్డి.
మొదటి ఉద్యోగం : అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్
ప్రస్తుత వృత్తి : కొన్నాళ్లు ఉద్యోగం చేశాక మానేసి 1985లో నంద్యాలలో భారతీ సీడ్స్ కంపెనీ స్థాపించారు. ఇప్పటి వరకు కంపెనీని
సక్సెస్ ఫుల్‌గా నడుపుతూ రైతులకు మంచి విత్తనాలు అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.
రాజకీయ ప్రస్థానం : 2004లో కోవెలకుంట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నించారు. ఆ ఏడాదిలో సిట్టింగ్‌లకే ఎమ్మెల్యే సీటును పార్టీ అధిష్టానం ప్రకటించడంతో పోచాకు టికెట్ రాలేదు.
పదవులు : వైఎస్ఆర్ హయాంలో ఆచార్య ఎన్జీ రంగా యూవర్సిటీ పాలక మండల సభ్యుడిగా నియామకం
సేవా కార్యక్రమాలు : స్వగ్రామంలోని ప్రజలకు తాగునీరు అందించడం
రాజకీయ గురువు : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
జీవిత లక్ష్యం : ప్రతి రైతుకు సాగునీరు అందించడం.
కర్నూలు ఎంపీ అభ్యర్థి
పేరు : డాక్టర్ సింగరి సంజీవ్‌కుమార్
తల్లిదండ్రులు : రంగమ్మ, శ్రీరంగం,
స్వగ్రామం : కర్నూలు
పుట్టిన తేదీ : 03–01–1967
కుటుంబీకులు : భార్య డాక్టర్ వసుంధర(గైనకాలజిస్టు), కుమార్తె డాక్టర్ సౌమ్య, కుమారులు అక్షయ్, అభిరామ్
చదువు : కర్నూలు మెడికల్ కాలేజీలో 1990లో ఎంబీబీఎస్, 1995లో ఎంఎస్ (జనరల్ సర్జరీ), పూర్తి చేశారు. 2000లో హైదరాబాద్ ఉస్మానియాలో ఎంసీహెచ్ (యూరాలజీ) చేశారు.
కుటుంబ నేపథ్యం : వృతిరీత్యా వైద్యుడు. కర్నూలులో ఆయుస్మాన్ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ప్రజలకు సుపరిచితుడే. ఈయన కుటుంబంలో 21 మంది వైద్యులు ఉన్నారు. సౌమ్యుడిగా పేరు ఉంది.
రాజంపేట ఎంపీ అభ్యర్థి
అభ్యర్థి పేరు : పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి
పుట్టిన తేదీ : 29 ఆగస్ట్ 1977
చదువు : ఎంబీఏ (యుకే)
పుట్టిన ఊరు : పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారిపల్లి
వయస్సు : 41
వృత్తి : రాజకీయం
తల్లిదండ్రులు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,స్వర్ణలత దేవి
భార్య పేరు : లక్ష్మిదివ్య
పిల్లలు : ఇద్దరు
సేవా కార్యక్రమాల : భాస్కర్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందిస్తున్నారు
రాజకీయాలు: రాజంపేట ఎంపీగా 2014లో ఘన విజయం సాధించారు
తిరుపతి
అభ్యర్థి పేరు : బల్లి దుర్గాప్రసాద్
పుట్టిన తేదీ : 15.06.1956
పుట్టిన ఊరు : వెంకటగిరి
విద్యార్హత : బీకాం. బీ.ఎల్
పదవులు : 1985,1994,1999, 2009 ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.
తల్లి పేరు : రామలక్ష్మి
తండ్రి పేరు : పెంచలయ్య
భార్య పేరు : సరళ
పిల్లలు : ముగ్గురు
చిత్తూరు
అభ్యర్థిపేరు : ఎన్.రెడ్డెప్ప
చదువు : ఎంఏ, బీఎల్
పుట్టిన తేదీ : 01–10–1951
వయస్సు : 68
స్వస్థలం : వల్లిగట్ల, సోమల మండలం
తండ్రి : కొండయ్య,
తల్లి : వెంకటమ్మ,
భార్య : ఎన్.రెడ్డెమ్మ, విశ్రాంత ఉపాధ్యాయురాలు
కుమారుడు : దినేష్, లెఫ్టినెంట్ ఆర్మీ కర్నల్‌గా పనిచేస్తున్నారు
పదవులు: దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్ర లిడ్‌క్యాప్ చైర్మన్‌గా పనిచేశారు.న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా 14 సార్లు పనిచేశారు. 1981 నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఏడాది పాటు పనిచేశారు. ఏజీపీగా 1984 నుంచి 1987 వరకు, ఎస్బీఐ, సప్తగిరి గ్రామీణబ్యాంకు, మున్సిపాలిటీకి, ఇతర ప్రైవేటు కంపెనీలకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారు.కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో మినరల్ డైవలెఫ్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా రెండేళ్లు పనిచేశారు. కేంద్ర ఉక్కు పరిశ్రమశాఖ డైరెక్టర్‌గా 2008–2009లో పనిచేశారు.
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎంపీ
పేరు: కాండ్రేగుల సత్యవతి
విద్యార్హత: ఎంబీబీఎస్, గైనకాలజిస్ట్
వయసు: 52
కుటుంబ సభ్యులు: భర్త పేరు కాండ్రేగుల విష్ణుమూర్తి(డాక్టర్), కుమారుడు యశ్వంత్(డాక్టర్), కుమార్తె పావని( డాక్టర్).
రాజకీయ నేపథ్యం: 2014 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
నిర్వహించిన పదవులు: రోటరీ ఒకేషనల్ అవార్డు, భారతవికాస పరిషత్ టాప్ డాక్టర్ ఆఫ్ ది టౌన్, వైఎంసీఏ డాక్టర్ ఆఫ్ ది మిలీనియం, రెండు నెలల క్రితం వైఎస్సార్సీపీ చేరారు.
విశాఖ ఎంపీ అభ్యర్థి
పేరు: ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ
విద్యార్హత: డిగ్రీ
వయసు: 54
కుటుంబ సభ్యులు: భార్య నాగ జ్యోతి, కుమారుడు శరత్.
రాజకీయ నేపథ్యం: ఆరు నెలలు క్రితం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. విశాఖ పార్లమెంట్ సమన్వయకర్తగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నిర్వహించిన పదవులు: విశాఖ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్‌గా రెండు దఫాలు వ్యవహరించారు.
అరకు ఎంపీ అభ్యర్థి
పేరు: గొట్టేటి మాధవి
విద్యార్హత: బీయస్సీ,బీపీఈడి
వయసు: 27
కుటుంబ సభ్యులు: తండ్రి పేరు గొడ్డేటి దేముడు( దివంగత మాజీ ఎమ్మెల్యే), అమ్మ పేరు చెల్లయ్యమ్మ.
రాజకీయ నేపథ్యం: ఈమె తండ్రి చింతపల్లి శాసన సభ్యుడిగా రెండు పర్యాయాలు పని చేశారు. 2018 ఆగష్టు 27 వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరింది.
నిర్వహించిన పదవులు: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త.
విజయనగరం ఎంపీ అభ్యర్థి
పేరు : బెల్లాన చంద్రశేఖర్
తండ్రి : లేటు సింహాచలం
వయస్సు : 56
విద్యార్హత : బీఎ, బీఎల్
భార్య : శ్రీదేవి
కుమారుడు: వంశీకష్ణ (అమెరికా)
ఫోన్ నంబర్: 94401 94059
పదవులు: బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లిలో గల మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో జెడ్పీటీసీగా, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. బెల్లాన చంద్రశేఖర్ తండ్రి సింహాచలం ప్రముఖ న్యాయవాది. ఆయన రెండు దశాబ్దాల పాటు చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు. బెల్లాన చంద్రశేఖర్ భార్య శ్రీదేవి చీపురుపల్లి మేజర్ పంచాయతీకి పదేళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. గరివిడి ఎస్డీఎస్ అటానమస్ డిగ్రీ కళాశాలలో 1980–1983 వరకు డిగ్రీ చదివిన రోజుల్లో వి ద్యార్థి సంఘ నాయకునిగా పనిచేశారు. 1990–1993లో మహారాజా కళాశాలలో బీఎల్ చదివారు.
శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి
పేరు: దువ్వాడ శ్రీనివాస్
కుటుంబ నేపథ్యం: భార్య దువ్వాడ వాణి(టెక్కలి మాజీ జెడ్పీటీసీగా పనిచేశారు).
విద్యార్హత: బీఏ లిటరేచర్, ఎంఏ లిటరేచర్, బీఎల్ (పీఆర్ కళాశాల, కాకినాడ)
రాజకీయ ప్రవేశం: 2001లో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ కార్యదర్శిగా, 2006 జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో పీఆర్పీ తరఫున టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఉప ఎన్నికల్లో మళ్లీ పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు.
ఉద్యమాలు: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో నిర్మాణం తలపెట్టిన ఈస్ట్ కోస్ట్ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా 2010 నుంచి పోరాడుతున్నారు.
నియోజకవర్గం : నరసాపురం అభ్యర్థి
అభ్యర్థి : కనుమూరి రఘురామకృష్ణంరాజు
వయసు : 57 ఏళ్లు, కులం : క్షత్రియ
భీమవరం: రఘురామకృష్ణంరాజు స్వగ్రామం ఆకివీడు మండలం ఐభీమవరం. ఆయన ఎం.ఫార్మశీ చేశారు. వివిధ రాష్ట్రాల్లో రెండు దశాబ్దాలకుపైగా విద్యుత్ రంగంలో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. భార్య రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, కుమారుడు భరత్ ఉన్నారు.
కాకినాడ అభ్యర్థి
అభ్యర్థి : వంగా గీత
కుటుంబం: భర్త కాశీ విశ్వనా«థ్, కుమార్తె సత్యపావని
వయస్సు: 52
విద్యార్హత: ఎంఏ, ఎంఏ, బీఎల్, ఎంఏ సైకాలజీ
రాజకీయ నేపథ్యం: 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 87 వరకూ మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 1995 నుంచి 2000 వరకూ జెడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. 2000 నుంచి 2006 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా, 2009 నుంచి 2014 వరకూ పిఠాపురం ఎమ్మెల్యేగా.
అమలాపురం అభ్యర్థి
అభ్యర్థి : చింతా అనూరాధ
తల్లిదండ్రులు: విజయభారతి, కృష్ణమూర్తి
భర్త: తాళ్ల సత్యనారాయణ
పుట్టిన తేదీ: 18.10.1972
విద్యార్హత: బీఏ
వచ్చిన భాషలు: తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడం
రాజకీయ రంగ ప్రవేశం : ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. తండ్రి చింతా కృష్ణమూర్తి 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున అమలాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత వైఎస్సార్ సీపీ అమలాపురం నియోజకవర్గం కో ఆర్డినేటర్‌గా కొంతకాలం పనిచేశారు. అనురాధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తండ్రి కృష్ణమూర్తి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
రాజమహేంద్రవరం అభ్యర్థి
అభ్యర్థి : మార్గాని భరత్‌రామ్
తల్లిదండ్రులు: ప్రసూన, నాగేశ్వరరావు
పుట్టిన తేదీ : 12.05.1986
విద్యార్హతలు : ఎంబీఏ
నేపథ్యం: విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు.
‘ఓయ్ నిన్నే’ సినిమాలో హీరోగా నటించారు. తండ్రి నాగేశ్వరరావు బీసీ సంక్షేమసంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్నారు. భరత్‌రామ్ ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఒంగోలు పార్లమెంట్
అభ్యర్థి పేరు : మాగుంట శ్రీనివాసులరెడ్డి
తండ్రి: రాఘవరెడ్డి, తల్లి: కౌసల్యమ్మ
స్వగ్రామం: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు
ప్రస్తుత నివాసం: రాంనగర్, ఒంగోలు, ప్రకాశం జిల్లా
కుటుంబం: భార్య గీతా లతమ్మ, పెద్ద కుమారుడు రాఘవరెడ్డి, పెద్ద కోడలు చందన, చిన్న కుమారుడు నిఖిల్‌బాబు
విద్యార్హత: బీకాం డిగ్రీ (1973లో నెల్లూరు జిల్లా వీఆర్ కాలేజీలో పూర్తిచేశారు. )
పుట్టిన తేదీ: 15.10.1953
రాజకీయ నేపథ్యం : 1998, 2004, 2009 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపిగా కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. తాజాగా 2019 ఎన్నికల్లో ఆరోసారి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో దిగుతున్నారు.
నెల్లూరు పార్లమెంట్
అభ్యర్థి పేరు : ఆదాల ప్రభాకర్‌రెడ్డి
తండ్రి – ఆదాల శంకరరెడ్డి
భార్య – వింధ్యావళి
కుమార్తెలు– భానురేఖ, హిమబిందు
విద్యార్హత – (ఇంజినీరింగ్)
వృత్తి – క్లాస్–1 కాంట్రాక్టర్
1997లో రాజకీయాల్లోకి ప్రవేశించి 1999లో అల్లూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004, 2009లలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందారు. 2014లో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు.