జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. వీరి వివరాలను ఒకసారి పరిశీలిస్తే....
పేరు: దువ్వాడ శ్రీనివాస్
కుటుంబ నేపథ్యం: భార్య దువ్వాడ వాణి(టెక్కలి మాజీ జెడ్పీటీసీగా పనిచేశారు).
విద్యార్హత: బీఏ లిటరేచర్, ఎంఏ లిటరేచర్, బీఎల్ (పీఆర్ కళాశాల, కాకినాడ)
రాజకీయ ప్రవేశం: 2001లో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ కార్యదర్శిగా, 2006 జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో పీఆర్‌పీ తరఫున టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఉప ఎన్నికల్లో మళ్లీ పీఆర్‌పీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు.
ఉద్యమాలు: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో నిర్మాణం తలపెట్టిన ఈస్ట్ కోస్ట్ పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా 2010 నుంచి పోరాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment