‘బాబు డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారు’ | YSRCP Leader Kolli Nirmala Kumari Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబు డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారు’

Published Sat, Feb 2 2019 4:53 PM | Last Updated on Sat, Feb 2 2019 5:00 PM

YSRCP Leader Kolli Nirmala Kumari Fires On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలను నిలువునా ముంచాడని వైఎస్సార్‌ సీపీ మహిళా నేత కొల్లి నిర్మలా కుమారి విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సబ్‌ప్లాన్‌ నిధులను మళ్లించటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన ఒక్క హమీ అయినా నెరవేర్చారా బాబు అంటూ మండిపడ్డారు.

ప్రపంచంలో ఇలాంటి సీఎం ఎక్కడా లేరన్నారు. చంద్రబాబు మాటలు ఏ మహిళా నమ్మడం లేదన్నారు. చంద్రబాబుకు కాపీ కొట్టడం మాత్రమే తెలుసని పేర్కొన్నారు. ‘చంద్రబాబు ఖబర్ధార్‌.. జాగ్రత్త, నీకు గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement