
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగున్నరేళ్లలో లక్షా యాభై వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇసుక, మట్టి, బడ్జెట్ అంతా మింగేశారని విమర్శించారు. ఫీజు రియంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలను విపరీతంగా పెంచారన్నారు. నక్కా అనంద్ బాబు దళిత ద్రోహి ఆరోపించారు. అసైన్డ్ భూములు ప్రభుత్వం లాక్కుంటుంటే నక్కా ఎమైపోయారని ప్రశ్నించారు. నక్కా ఆనంద్ బాబు బహిరంగ లేఖపై చర్చకు తాము సిద్ధమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment