వెల్‌లో నిరసన తెలుపుతున్న వైసీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వి. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి మరీ నిరసన తెలిపారు. రూల్ 267 కింద స్వల్పకాలిక చర్చకు పట్టుబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో ఈ అంశంపై మంగళవారం చర్చ చేపట్టనున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే బీఏసీ సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. విపక్ష సభ్యుల నిరసనతో 20 నిమిషాలపాటు ప్రత్యక్షప్రసారం నిలిపివేశారు. అంతకుమందు విపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 గంటలలోపు రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది.
కొనసాగిన టీడీపీ ఎంపీల డ్రామా
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తన స్థానంలోనే ఉండిపోగా, ఎంపీలు టీజీ వెంకటేష్, సీతారామలక్ష్మి, గరికపాటి మోహన్‌రావు వెల్‌లోకి వెళ్లారు. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment