నామినేషన్లు దాఖలు చేసేందుకు కలిసి వెళ్తున్న టీడీపీ, కాంగ్రెస్ నాయకులు
వనపర్తి: తొలివిడత నామినేషన్ల ఘట్టం బుధవారం ముగిసింది. మూడురోజుల పాటు కొనసాగిన నామినేషన్ల స్వీకరణలో మొదటి, రెండోరోజు నామమాత్రంగానే దాఖలయ్యాయి. చివరిరోజు ఉదయం 11గంటల నుంచే నామినేషన్లు ఊపందుకున్నాయి. తొలివిడత నాలుగు మండలాల్లో రేవల్లి మినహా మిగతా మూడు మండలాలు వనపర్తి, ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు చివరి రోజు 60కి తగ్గకుండా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
జెడ్పీటీసీ స్థానానికి రేవల్లి మండలంలో అత్యధికంగా తొమ్మిది మంది 14 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు బుధవారం చివరిరోజు కావటంతో ఆయా మండల కేంద్రాల్లోని నామినేషన్లు స్వీకరించే కేంద్రాల వద్దకురాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నామినేషన్ల కౌంటర్‌కు వందమీటర్ల దూరం వరకు ఎవ్వరినీ అనుమతించలేదు. కేవలం అభ్యర్థితో పాటు ప్రపోజర్లు, సాక్షులు మొత్తం నలుగురిని మాత్రమే లోపలికి వెళ్లనిచ్చారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు మండల పరిషత్ కార్యాలయానికి టీడీపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు కలిసే ర్యాలీగా వచ్చారు.
నేడు నామినేషన్ల పరిశీలన
అధికారులు గురువారం తొలివిడత నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపడతారు. ఉపసంహరణకు ఈనెల 28వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. నామినేషన్లు సక్రమంగా పూరించకపోయినా, తప్పులు దొర్లినా, అధికారులు ఆ నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉంటుంది.
ఎంపీటీసీ నామినేషన్లు ఇలా..
తొలివిడత నాలుగు మండలాల్లో నిర్వహిస్తున్న ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా 40 ఎంపీటీసీ స్థానాలకు 206 మంది అభ్యర్థులు మొత్తం 259 నామినేషన్లు దాఖలైనట్లు లైజన్ అధికారి నర్సింహులు తెలిపారు. వనపర్తి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా బీజేపీ పార్టీ నుంచి 9, కాంగ్రెస్ పార్టీ నుంచి 29, టీఆర్‌ఎస్ పార్టీ నుంచి 18, టీడీపీ నుంచి 4, ఇండిపెండెంట్‌ల నుంచి 16 దాఖలయ్యాయి. అలాగే ఖిల్లాఘనపురం మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 88 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 9, కాంగ్రెస్ పార్టి నుంచి 22, టీఆర్‌ఎస్ నుంచి 34, టీడీపీ నుంచి 2, ఇండిపెండెంట్‌ల నుంచి 21 దాఖలయ్యాయి. గోపాల్‌పేట మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 60 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 6, కాంగ్రెస్ నుంచి 20, టీఆర్‌ఎస్ నుంచి 17, టీడీపీ నుంచి 2, ఇండిపెండెంట్‌ల నుంచి 14, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 1 దాఖలయ్యాయి. రేవల్లి మండలంలో మొత్తం 6 ఎంపీటీసీ స్థానాలకు గాను మొత్తం 35 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నుంచి 02, కాంగ్రెస్ నుంచి 8, టీఆర్‌ఎస్ నుంచి 8, టీడీపీ నుంచి 1, ఇండిపెండెంట్‌ల నుంచి 14, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి 2 దాఖలయ్యాయి.
రెండో విడతకు రేపటి నుంచే నామినేషన్లు
జిల్లాలో మలివిడత ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించే పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూర్, అమరచింత మండలాల పరిధిలోని 5 జెడ్పీటీసీ స్థానాలకు, 43 ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండ ల పరిషత్ కార్యాలయాల్లో ఈనెల 26వ తేదీనుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమం కోసం ఆయామండల పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జెడ్పీటీసీ నామినేషన్లు ఇలా..
జిల్లాలో తొలివిడత ఎన్నికలు నిర్వహించే నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. వనపర్తి మండలంలో బీజేపీ నుంచి 0 1, కాంగ్రెస్ నుంచి 01, టీఆర్‌ఎస్ నుంచి 04, టీ డీపీ నుంచి 01, ఇండిపెండెంట్‌ల నుంచి 2 దాఖలయ్యాయి. ఖిల్లాఘనపురం మండలంలో బీజేపీ నుంచి 01, కాంగ్రెస్ నుంచి 03, టీఆర్‌ఎస్ నుంచి 03, టీడీపీ నుంచి నిల్, ఇండిపెండెంట్‌ల నుంచి 1 దాఖలయ్యాయి. గోపాల్‌పేట మండలంలో బీజేపీ నుంచి 01, కాంగ్రెస్ నుంచి 01, టీఆర్‌ఎస్ నుంచి 03, టీడీపీ నుంచి నిల్. రేవల్లి మండలంలో బీజేపీ నుంచి 01, కాంగ్రెస్ నుంచి 06, టీఆర్‌ఎస్ 05, టీడీపీ నుంచి 01, ఇండిపెండెంట్‌ల నుంచి 2 దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment